Site icon HashtagU Telugu

Noida : నోయిడాలో 750 బాక్సుల అక్ర‌మ‌ మ‌ద్యాన్ని ప‌ట్టుకున్న పోలీసులు

Illegal Liquor Noida Imresizer

Illegal Liquor Noida Imresizer

హర్యానా నుంచి అరుణాచల్‌ప్రదేశ్‌కు అక్రమంగా తరలిస్తున్న మ‌ద్యాన్ని నోయిడా పోలీసులు ప‌ట్టుకున్నారు. రూ.45 లక్షల విలువైన 750 బాక్సుల అక్రమ మద్యంతో పాటు స్మగ్లర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అంతర్ రాష్ట్ర మద్యం స్మగ్లర్ ముఠా హర్యానా నుంచి అక్రమ మద్యాన్ని తీసుకువెళ్లి నోయిడా ఎఫ్‌ఎన్‌జి రోడ్డులో విక్రయిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. సమాచారం అందుకున్న పోలీస్ స్టేషన్ సెక్టార్ 63 ఎఫ్‌ఎన్‌జి రోడ్‌లో చెకింగ్ ఆపరేషన్ ప్రారంభించి.. సుమారు 750 మద్యం బాక్సులను తీసుకెళ్తున్న డ్రైవర్‌ను పట్టుకున్నారు.ఈ ముఠా హర్యానా నుంచి అరుణాచల్‌కు ఒకే బిల్లుపై పలు కంటైనర్లను రవాణా చేసేదని విచారణలో డ్రైవర్ వెల్లడించాడు. కంటైనర్‌ను స్వాధీనం చేసుకున్నామని.. ట్రక్ డ్రైవర్‌ను అరెస్టు చేసినట్లు అదనపు సెంట్రల్ డీసీపీ విశాల్ పాండే తెలిపారు. ఈ స్మగ్లర్లు ఒకే బిల్లుపై హర్యానా నుంచి అరుణాచల్‌కు అనేక ట్రక్కులను రవాణా చేసేవారని.. త్వరలో ముఠా సభ్యులందరినీ ప‌ట్టుకుంటామ‌ని డీసీపీ తెలిపారు.