Site icon HashtagU Telugu

Night Club : గురుగ్రామ్ లో నైట్‌క్లబ్‌పై పోలీసుల రైడ్‌.. 288 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

Pub Imresizer

Pub Imresizer

గురుగ్రామ్ పోలీసులు నైట్‌క్లబ్‌పై రైడ్ చేశారు. ఈ రైడ్‌లో 288 మందిని అదుపులోకి తీసుకున్నారు. నైట్ క్ల‌బ్‌లో హెరాయిన్, కొకైన్, MDMA సహా పలు నిషేధిత డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గురుగ్రామ్‌లోని ఉద్యోగ్ విహార్ ఫేజ్-3లోని కాసా డాంజా క్లబ్‌పై దాడులు జరగడానికి ముందు గత ఒకటిన్నర నెలలుగా పోలీసులు నిఘా పెట్టారు. నైట్‌క్లబ్‌లో నిషేధిత డ్రగ్స్ సేవించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అదుపులోకి తీసుకున‌న 288 మంది అనుమానితుల రక్త నమూనా నివేదికలను ప‌రిశీలించిన‌ తర్వాత అదుపులోకి తీసుకున్న వారిపై తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ 288 మంది వ్యక్తులను త‌నిఖీ చేసినప్పుడు వారి వద్ద నుండి ఎటువంటి డ్ర‌గ్స్ క‌నుగోన‌లేద‌ని పోలీసులు తెలిపారు. క్ల‌బ్‌లో మాత్రం డ్ర‌గ్స్ ఉన్న‌ట్లు తెలిపారు. ఈ క్ల‌బ్‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు. తదుపరి విచారణ జరుగుతోందని.. రక్త నమూనాలను ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్)కు పంపిస్తామ‌ని పోలీసులు తెలిపారు.

Exit mobile version