Nampally Fire Accident: బిల్డింగ్ ఓనర్‌ రమేష్ జైస్వాల్‌పై మూడు సెక్షన్ల కింద కేసులు

నాంపల్లిలోని బజార్‌ఘాట్‌లో సోమవారం జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే భవన యజమాని రమేష్ జైస్వాల్‌పై పోలీసులు మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 304, 285, 286 సెక్షన్ల కింద రమేష్ జైస్వాల్‌పై కేసులు నమోదు చేశారు.

Published By: HashtagU Telugu Desk
Nampally Fire Accident (1)

Nampally Fire Accident (1)

Nampally Fire Accident: నాంపల్లిలోని బజార్‌ఘాట్‌లో సోమవారం జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే భవన యజమాని రమేష్ జైస్వాల్‌పై పోలీసులు మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 304, 285, 286 సెక్షన్ల కింద రమేష్ జైస్వాల్‌పై కేసులు నమోదు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని , కెమికల్స్ వల్లే భవనం మొత్తం వ్యాపించిందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు .

ఘటన సమయంలో అక్కడే ఉన్న యజమాని రమేష్ జైస్వాల్ భవనంలో చిక్కుకున్న వారిని చూసి స్పృహతప్పి పడిపోయాడు. కుటుంబ సభ్యులు అతన్ని లక్డీకాపూల్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు.

రమేష్ ఆస్పత్రిలో ఉన్నట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. డిశ్చార్జి కాగానే అతనిపై పోలీసులు చర్యలు తీసుకుంటారు. క్లూస్ టీం ఇప్పటికే భవనం వద్ద నమూనాలను సేకరించింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందగా , మరో 10 మంది అపస్మారక స్థితిలో పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.

Also Read: Voice Chat : వాట్సాప్ గ్రూప్ కాల్స్‌లో ‘వాయిస్ ఛాట్’ విశేషాలివీ..

  Last Updated: 14 Nov 2023, 03:57 PM IST