Hyderabad: గేమింగ్ అడ్డాపై పోలీసులు దాడులు.. లేడీ డాన్ అరెస్ట్, భారీ నగదు స్వాధీనం

  • Written By:
  • Updated On - April 30, 2024 / 12:05 PM IST

Hyderabad: పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. క్రమం తప్పకుండా దాడులు చేస్తున్నా అక్రమంగా కార్యాకలాపాలు కొనసాగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ కేంద్రంగా బెట్టింగ్, వ్యభిచారం, మూడు ముక్కలాట లాంటి కార్యాకలాపాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ ఇంటిపై పోలీసులు దాడి చేసి ఓ లేడీ డాన్ ను అరెస్ట్ చేశారు.

లేడీ డాన్ అక్రమంగా నిర్వహిస్తున్న గేమింగ్ అడ్డా పై సైబరాబాద్ SOT దాడి  చేశారు. రూ.62,620 నగదును స్వాధీనం చేసుకొని 9 మందిని అరెస్ట్ చేశారు. SOT మాదాపూర్ టీమ్, రాయదుర్గం పోలీసులు రాయదుర్గం PS పరిధి లోని ఖాజాగూడ లో ఫ్లాట్ నెం. 304, AC అట్లాంటిక్స్ అపార్ట్‌మెంట్ పై దాడి చేశారు.  అక్రమంగా మూడు ముక్కలాట ఆడుతున్న 9 మంది వ్యాపారులను పట్టుకున్నారు పోలీసులు.

కమ్మంపాటి మాధవి అనే మహిళ గత కొంత కాలంగా అక్రమంగా గేమింగ్ (మూడు ముక్కలాట) నిర్వహిస్తుందని తెలిసింది.  హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల నుండి ఫంటర్స్ ను పిలిపించి పెద్దయెత్తున గేమింగ్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది.  ప్రతి ఆటకు రూ 1000/- లు ఆర్గనైజర్ ఫీ వసూలు చేస్తూ, రోజులో సుమారు 100 లకు పైగా నిర్వహిస్తుందని తెలుస్తుంది. నగదు రూ. 62,620తో పాటు మొబైల్ ఫోన్లు – 11,  ప్లేయింగ్ కార్డ్స్ – 5 సెట్లు స్వాధీనం చేసుకొని రాయదుర్గం పోలీసులు కేస్ దర్యాప్తు చేస్తున్నారు.