Hyderabad: హైదరాబాద్ లో పోలీసుల తనిఖీలు.. భారీగా గంజాయి, డబ్బులు స్వాధీనం

  • Written By:
  • Updated On - April 27, 2024 / 08:05 PM IST

Hyderabad: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో పాటు గంజాయి అక్రమ రవాణా ను నియంత్రించేందుకు మల్టీ జోన్ 1 పరిధిలో 16 జిల్లాల్లో పోలీసులు, ప్రధాన రోడ్డు మార్గాల్లో వాహన తనిఖీలతో పాటు రైళ్ళల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. అక్రమ గంజాయి కట్టడి చేయాలనే లక్ష్యంగా మల్టీ జోన్ 1 ఐ. జీ ఎ. వి. రంగనాథ్ ఆదేశాల మేరకు మల్టీ జోన్ 1 పరిధిలోని 16జిల్లాల్లో పోలీస్ అధికారులు, ఆకస్మిక వాహన తనిఖీలు చేపట్టారు.

మల్టీ జోన్ 1 పరిధిలో చేపట్టిన పోలీసుల తనిఖీల్లో డబ్బుతో పాటు, మద్యం, గంజాయి భారీగా పట్టుబడింది. ఈ తనిఖీల్లో సుమారు 2,81,36,128/- రూపాయల నగదు, 4,05,823/- రూపాయల విలువగల మద్యం సీసాలు, 3,15,788/- రూపాయల విలువలైన 15.479 కిలోగ్రామ్స్ గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో పాటు 15 కేసులు నమోదు చేసి గంజాయిని అక్రంగా తలిస్తున్న 25 వ్యక్తులతో పాటు, 8 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.