LS Polls: హైదరాబాద్ లో పోలీసుల ముమ్మర తనిఖీలు.. కోటి ఆరు లక్షలు పట్టివేత

  • Written By:
  • Publish Date - May 1, 2024 / 12:00 PM IST

LS Polls: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ తో పాటు పలు కమిషనరేట్ పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. రోజురోజుకూ పెద్ద మొత్తంలో భారీగా డబ్బు పట్టుబడుతోంది. తాజాగా సైబరాబాద్ SOT టీమ్స్, సైబరాబాద్ లోని వివిధ పోలీస్ స్టేషన్స్ సిబ్బంది తో కలిసి 6 ప్రదేశాలలో బ్యాంకు లకు నగదు తీసుకువెళ్లే 6 వాహనాలలో తనిఖీలు నిర్వహించారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన సరైన క్యూఆర్ కోడ్‌లు, ఇతర విధానాలు పాటించకుండా రూ. 1,06,62,730/-. రవాణా చేస్తుండగా పట్టుకున్నారు.

SOT మేడ్చల్ టీమ్ రూ.60,17,400, రాజేంద్రనగర్ టీమ్ రూ. 22,30,600/- అత్తాపూర్ పోలీస్ స్టేషన్, మేడ్చల్ టీమ్ 9,11,900, మాదాపూర్ టీమ్ రూ.07,38,237/- చందానగర్ పోలీస్ స్టేషన్, బాలానగర్ టీమ్ 2,62,600తో పాటు ఇతర చోట్లా భారీగా నగదు పట్టుబడింది. అయితే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ పరిధిలో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు డబ్బుతో పాటు గంజాయి, డ్రగ్స్, మత్తు పదార్థాలు దొరుకుతుండటంతో షాక్ అవుతున్నారు.