Site icon HashtagU Telugu

Vizag:వైజాగ్ లో కానిస్టేబుల్ అనుమానాస్ప‌ద మృతి.. కార‌ణాల‌పై పోలీసుల ఆరా.. ?

Suicide

Suicide

విశాఖ‌ప‌ట్నంలో డిసెంబర్ 30న అదృశ్యమైన పోలీస్ కానిస్టేబుల్ డోకుల శ్రీనివాసులు శనివారం శవమై కనిపించాడు. 2009 బ్యాచ్ కు చెందిన డోకుల శ్రీనివాసులు (38) విశాఖపట్నంలోని ఎంవీపీ క్రైం పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం మెడికల్ లీవుపై ఉన్న శ్రీనివాసనాయుడు గత నెల 30న స్వగ్రామం గరుగుబిల్లి మండలం నందివానివలసకు వచ్చాడు. అక్కడి నుంచి వ్యక్తిగత పనుల నిమిత్తం కురుపాం సమీపంలోని జోగిరాజుపేటకు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో పెదమేరంగి జంక్షన్ నుంచి నందివానివలసలోని తన ఇంటికి వెళ్లకుండా అత్యవసర పని ఉందని తల్లి సింహాచలమ్మకు చెప్పి రాత్రి 9.15 గంటలకు మోటార్ సైకిల్ పై బయలుదేరాడు. అనంతరం ఖడ్గవలస, ఉల్లిభద్ర జంక్షన్‌కు వెళ్లి అదృశ్యమైనట్లు ఫోన్‌ సిగ్నల్స్‌ అందాయి. అనంతరం డిసెంబర్ 31న కానిస్టేబుల్ తండ్రి సింహాచలన్ నాయుడు గరుగుబిల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎల్విన్‌పేట సీఐ టీవీ తిరుపతిరావు ఆధ్వర్యంలో మూడు బృందాలు కానిస్టేబుల్‌ కోసం గాలించాయి. ఎట్టకేలకు శనివారం మధ్యాహ్నం తోటపల్లి ఐటీడీఏ పార్కు సమీపంలోని తుప్పల్లో శ్రీనివాసన్ మృతదేహం లభ్యమైంది. అక్కడే కానిస్టేబుల్ శ్రీనివాసులు మోటార్ సైకిల్ కూడా దొరికింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. శ్రీనివాసనాయుడు విశాఖపట్నం, నందివానివలసలో కానిస్టేబుల్‌గా పనిచేస్తూ వ్యాపారం చేస్తున్నాడు. శ్రీనివాసులు మృతి విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. శ్రీనివాసులు అనుమానాస్ప‌ద‌మృతికి గ‌ల కార‌ణాల‌పై పోలీసులు లోతుగా ద‌ర్యాప్తు చేస్తున్నారు.