Site icon HashtagU Telugu

Durga Temple : ఇంద్రకీలాద్రిపై పోలీసుల అత్యూత్సాహం.. అర్చ‌క స్వాముల‌ను..?

Durga Temple

Durga Temple

దుర్గ‌గుడిలో ద‌స‌రా ఉత్స‌వాల్లో పోలీసులు అత్యూత్సాహం ప్ర‌ద‌ర్శిస్తున్నారు. బందోబ‌స్తుకు వ‌చ్చిన పోలీసులు ఇష్టారీతిన వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు ఎక్కువ‌గా వ‌స్తున్నాయి. దుర్గ గుడిలో అర్చక స్వాములను పోలీసులు నిలిపివేస్తున్న ఘ‌ట‌న‌పై అర్చ‌కులు తీవ్ర మ‌న‌స్థాపం చెందుతున్నారు. దుర్గగుడి ఈవో భ్రమరాంబ తమకు అర్చ‌కుల‌ను అనుమ‌తించాల‌ని ఆదేశాలు జారీ చేయలేదని పోలీసులు చెప్పుకువ‌స్తున్నారు. పోలీసుల తీరు ఈ విధంగా కొనసాగితే తాము విధులు నిర్వర్తించలేమని అర్చకులు ఆవేదన వ్య‌క్తం చేస్తున్నారు. ఈవో భ్ర‌మ‌రాంబ‌ తీరుపై అర్చకులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఉత్సవాలు తొలి రోజు నుంచి సమన్వయ లోపాలు తలెత్తుతూనే ఉన్నాయి. వీటిని పరిష్కరించే దిశగా ఈవో చర్యలు చేపట్టడం లేదని దుర్గ గుడి ఉద్యోగులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.