Site icon HashtagU Telugu

CI Ashok : సీఐ కొంప ముంచిన ప్రసంగం.. వీఆర్‌కు పంపుతూ ఆదేశాలు

Ci Ashok

Ci Ashok

CI Ashok : ప్రభుత్వ అధికారుల అనాలోచిత వ్యాఖ్యలు వాళ్లకు ఇబ్బందులు కలిగిస్తాయి. తమ విధి నిర్వహణలో ఉన్నవారు ఇతరుల మాదిరిగా మాట్లాడకుండా నిర్దిష్ట నియమాలు పాటించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఏమైనా బహిరంగ వేదికపై చేసిన వ్యాఖ్యలు వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, దీంతో సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. తాజాగా ఒక పోలీస్ అధికారి చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా ఉన్నతాధికారులు అతడిని వీఆర్‌కు పంపించారు.

Iconic Bridge : తెలంగాణ-ఏపీ బార్డర్‌లో కృష్ణా నదిపై నాలుగు లేన్ల భారీ వంతెన

మాట్లాడిన వ్యక్తి ఉభయ గోదావరి జిల్లాల్లోని రామచంద్రపురం సీఐ కె అశోక్ కుమార్. ఆయన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగిన ఒక సామాజిక వర్గ వన సమారాధనలో పాల్గొని ప్రసంగించారు. ఈ ప్రసంగంలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అశోక్ కుమార్ వ్యాఖ్యలు ఇలాంటి విధంగా ఉన్నాయి: “మనల్ని మనం నిరూపించుకుంటే ఉమ్మడి గోదావరి జిల్లాలో మనదే పైచేయి అవుతుంది. మీ ఇగోలతో పిల్లల భవిష్యత్తు పాడుచేయొద్దు. రాజకీయం వేరు, కులం వేరు. ఏ వ్యక్తి ఏ పార్టీలో ఉన్నా కులాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కృషి చేయాలి.”

ఇతని వ్యాఖ్యలు అన్ని వర్గాలను సమానంగా చూడాల్సిన అధికారిగా ఆయన వేదిక పంచుకోవడమే కాకుండా, సామాజిక నాయకుడిగా మాట్లాడటం విమర్శలకు గురి అయ్యింది. ఈ విషయం తాళ్లపాలెం సర్పంచ్ కట్టా గోవింద్ శుక్రవారం ఐఏఎస్ అధికారి కె హర్షవర్థన్ దృష్టికి తీసుకువెళ్లారు. కాగా, సీఐ వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు ఆయనపై విచారణ చేపట్టారు. ఆ తరువాత, పోలీస్ ఉన్నతాధికారులు అతడిని విఆర్‌కు పంపాలని ఆదేశాలు జారీ చేశారు.

India vs Australia: తొలి ఇన్నింగ్స్‌లో 104 ప‌రుగుల‌కే కుప్ప‌కూలిన ఆసీస్‌.. ఐదు వికెట్లు తీసిన బుమ్రా!