ఆంధ్రప్రదేశ్ వైసీపీ నేతలకు “రెడ్ బుక్” నిద్ర పట్టకుండా చేస్తుంది. వైసీపీ హయాంలో రెచ్చిపోయిన వారందరి పేర్లు రెడ్ బుక్ లో నమోదు కాగా…ఇప్పుడు ఆ నేతలంతా వరుసగా అరెస్ట్ అవుతున్నారు. ఇప్పటికే పలువురు అరెస్టయి జైలు పలుకగా, ఇక ఇప్పుడు గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని వంతు వచ్చినట్లు తెలుస్తుంది. తాజాగా ఆయన అనుచరులకు పోలీసులు నోటీసులు జారీ చేసారు. కొడాలి నాని కీలక అనుచరులుగా ఉన్న దుక్కిపాటి శశిభూషణ్, గొర్ల శ్రీను, పాలడుగు రాంప్రసాద్ లకు గుడివాడ పోలీసులు 41ఏ నోటీసులు జారీ చేశారు.
Nara Lokesh : త్వరలోనే టీచర్ల బదిలీల కోసం ప్రత్యేక చట్టం : మంత్రి లోకేశ్
ఈ నోటీసులు ప్రధానంగా లిక్కర్ గోడౌన్ అక్రమ వ్యవహారం, వాలంటీర్లతో బలవంతంగా రాజీనామాలు చేయించిన ఘటనలకు సంబంధించినవే. ఈ నోటీసులతో గుడివాడ రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. కొడాలి నాని అనుచరులపై దర్యాప్తు ప్రారంభమవుతుండటంతో, త్వరలో కొడాలి నాని కూడా విచారణకు హాజరయ్యే అవకాశముంది అని అంత భావిస్తున్నారు. వైసీపీ నేతలు దీనిని రాజకీయ కక్ష సాధింపు చర్యగా అభివర్ణిస్తుండగా, టీడీపీ వర్గాలు మాత్రం ఇది చట్ట ప్రక్రియ మాత్రమే అని చెబుతున్నాయి.