Hyderabad: హైదరాబాద్ లో గంజాయి ముఠాను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గంజాయిని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలకు పాల్పడుతుంది. రాష్ట్రంలో గంజాయి సరఫరా అనేది ఉండకూడదని పోలీసులుకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు గంజాయి బ్యాచ్ పై ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా నగరంలో ఇద్దరు అంతర్రాష్ట్ర ముఠాను అరెస్ట్ చేశారు. అబ్దుల్లాపూర్‌మెట్ లో నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద 22 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఒకరైన జలాలుద్దీన్ సిద్ధికి అహ్మద్ హుసేన్ సిద్ధికి మహారాష్ట్రలో పనిచేస్తున్నప్పుడు గంజాయి వ్యాపారితో పరిచయం ఏర్పడింది. అరకులో కిలో రూ.10వేలకు సిద్ది కొనుగోలు చేసి కిలో రూ.20వేలకు విక్రయిస్తుండేవాడని పోలీసులు తెలిపారు. సిద్దికి మరియు అతని సహ నిందితుడు జమీల్ అక్తర్ గంజాయి కొనుగోలు కోసం ప్రతి నెలా రెండుసార్లు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేవారని పోలీసులు తెలిపారు.
Also Read: Samantha : మయోసైటిస్ ట్రీట్మెంట్‌కు 25 కోట్ల ఖర్చు.. కౌంటర్ ఇచ్చిన సమంత..