Site icon HashtagU Telugu

Renuka Chowdary : రేణుకా చౌదరిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు

Renuka

Renuka

పోలీసుల విధుల‌కు ఆటంకం క‌లిగించినందుకు కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకురాలు రేణుకా చౌదరిపై గురువారం కేసు నమోదైంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రాహుల్ గాంధీని వేధించడాన్ని నిరసిస్తూ ‘ఛలో రాజ్ భవన్’ నిరసనలో పాల్గొన్న రేణుక చౌద‌రిని పోలీసులు ప్రివెంటివ్ కస్టడీలోకి తీసుకుని తరలించే సమయంలో ఎస్ ఐచొక్కా పట్టుకున్నారని పోలీసులు కేసు న‌మోదు చేశారు.
సబ్ ఇన్‌స్పెక్టర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

అయితే ఆమె ఆ ఘ‌ట‌న‌కు వివ‌ర‌ణ ఇచ్చారు. రేణుకా చౌదరి తాను కిందపడిపోతున్నానని, అందుకే ఎస్ఐని పట్టుకున్నానని, అతనిపై ఎలాంటి ద్వేషం లేదని తెలిపారు. రాజ్‌భవన్‌కు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో ఖైరతాబాద్‌లో కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నాకు దిగారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేయడంతో కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు గాయపడ్డారు. రాజ్‌భవన్‌కు వెళ్లే మార్గాలను పోలీసులు అడ్డుకోవడంతో, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ద్విచక్ర వాహనానికి నిప్పంటించారు మరియు TSRTC బస్సుల అద్దాలు ధ్వంసం చేశారు. తెలంగాణ కాంగ్రెస్‌ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, సీఎల్‌పీ నేత మల్లు భట్టి విక్రమార్క, గీతారెడ్డి తదితర నేతలను అరెస్టు చేసి నగరంలోని వివిధ పోలీస్‌ స్టేషన్లకు తరలించారు.