Site icon HashtagU Telugu

Rave Party: డ్ర‌గ్స్ కేసులో పోలీసుల ద‌ర్యాప్తు ముమ్మ‌రం.. నిందితుల కాల్ డేటాపై పోలీసుల ఫోక‌స్‌

Banjara Police

Banjara Police

హైదరాబాద్‌: రాడిసన్‌ బ్లూ హోటల్‌ డ్రగ్‌ కేసును విచారిస్తున్న బంజారాహిల్స్‌ పోలీసులు కేసులో అనుమానితులుగా ఉన్న నలుగురు వ్యక్తుల కాల్‌ డీటెయిల్‌ రికార్డులను విశ్లేషిస్తున్నారు. నలుగురు నిందితులు కిరణ్ రాజు, అభిషేక్ వుప్పల, M అనిల్ కుమార్, అర్జున్ వీరమాచినేని వాట్స‌ప్‌ లేదా మరేదైనా అప్లికేషన్ ద్వారా కమ్యూనికేట్ చేసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
అభిషేక్ వుప్పాల, అనిల్ కుమార్‌లను పోలీసులు అరెస్టు చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు సమాచారం. పట్టుబడిన డ్ర‌గ్స్ కొకైన్ అని ఫోరెన్సిక్ పరీక్షలో నిర్ధారించడంతో, ఇప్పుడు పోలీసులు హోటల్‌కు డ్రగ్‌ను తీసుకువచ్చిన వ్యక్తులపై దృష్టి సారించారు. హైదరాబాద్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ బృందం రాడిసన్ బ్లూ హోటల్‌లోని పుడ్డింగ్ & మింక్ పబ్‌పై దాడి చేసి అభిషేక్ వుప్పాల, అనిల్ కుమార్‌లను అరెస్టు చేసింది. వీరిద్దరి కస్టడీ కోసం పోలీసులు పిటిషన్ దాఖలు చేయగా బుధవారం కోర్టులో విచారణ జరగనుంది.

Exit mobile version