Helmets: ఇవేం రూల్స్.. హెల్మెట్ పెట్టుకున్నా.. ఫైన్ వేసిన పోలీసులు

Helmets: జగిత్యాల జిల్లా .. వాహనదారులను రోడ్డు ప్రమాదాల నుంచి కాపాడాలని కేంద్ర ప్రభుత్వం హెల్మెట్ తప్పనిసరిగా మారిస్తే హెల్మెట్ దరించని వారికి కాకుండా జగిత్యాల ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ పెట్టుకున్న వాహన దారుడికి ఫైన్ వేసి జనాన్ని విస్తుపోయేలా చేసిన సంఘటన జగిత్యాల లో చిటుచేసుకుంది. జగిత్యాల పట్టణానికి చెందిన ఓ వ్యక్తి తన ద్విచక్ర వాహనమైన MH01DH 3144 వాహనంపై హెల్మెట్ ధరించి స్థానిక అంగడి బజార్ నుంచి కొత్త బస్టాండ్ వైపుగా పోతున్నాడు. అక్కడే […]

Published By: HashtagU Telugu Desk
Traffic Diversion (1)

Traffic Diversion (1)

Helmets: జగిత్యాల జిల్లా .. వాహనదారులను రోడ్డు ప్రమాదాల నుంచి కాపాడాలని కేంద్ర ప్రభుత్వం హెల్మెట్ తప్పనిసరిగా మారిస్తే హెల్మెట్ దరించని వారికి కాకుండా జగిత్యాల ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ పెట్టుకున్న వాహన దారుడికి ఫైన్ వేసి జనాన్ని విస్తుపోయేలా చేసిన సంఘటన జగిత్యాల లో చిటుచేసుకుంది. జగిత్యాల పట్టణానికి చెందిన ఓ వ్యక్తి తన ద్విచక్ర వాహనమైన MH01DH 3144 వాహనంపై హెల్మెట్ ధరించి స్థానిక అంగడి బజార్ నుంచి కొత్త బస్టాండ్ వైపుగా పోతున్నాడు.

అక్కడే విధుల్లో ఉన్న ఓ ట్రాఫిక్ పోలీసు తన కెమెరాలో ఈ వాహనదారుడిని బంధించేశాడు. తీరా హెల్మెట్, ఇతర నిబంధనల ఉల్లంఘనలపై ఈ చాలాన్ లో వాహనాల ఫోటోలను అప్లోడ్ చేసే సమయంలోను అక్కడి ఉద్యోగి గమనించకుండా అప్లోడ్ చేయడంతో ఈ ముచ్చట కాస్తా చర్చల్లోకి దారితీసింది. హెల్మెట్ లేకుంటే ఫైన్ పడాలికాని హెల్మెట్ పెట్టుకొన్నా ఫైన్ వేయడమేంటి ఇది ప్రజల్లోకి ఎలాంటి సందేశాన్ని చేరవేస్తుందని విద్యావంతులు అంటున్నారు. ఇకనైనా ట్రాఫిక్ పోలీసులు తప్పుచేసినోళ్లకే ఫైన్లు వేయాలంటూ పలువురు ప్రజలు ట్రాఫిక్ పోలీసులను కోరుతున్నారు.

  Last Updated: 26 Jun 2024, 10:01 PM IST