Puri Jagannadh: పూరికి డిస్ట్రిబ్యూటర్స్ వార్నింగ్.. పోలీసులకు కంప్లైంట్ చేసిన డైరెక్టర్

విజయ్ దేవరకొండ, అనన్య పాండే ప్రధాన పాత్రల్లో నటించిన లైగర్ మూవీకి పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించారు. ఈ పాన్ ఇండియన్ చిత్రం

Published By: HashtagU Telugu Desk
Puri

Puri

విజయ్ దేవరకొండ, అనన్య పాండే ప్రధాన పాత్రల్లో నటించిన లైగర్ మూవీకి పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించారు. ఈ పాన్ ఇండియన్ చిత్రం భారీ అంచనాల మధ్య రిలీజై బోల్తా కొట్టింది.  ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లు జి. శోభన్ బాబు, వరంగల్ శ్రీనులపై పూరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిద్దరూ తాను లేనప్పుడు తన కుటుంబాన్ని వేధిస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. పూరి జగన్నాధ్ వరంగల్ శ్రీను తన సహ-పంపిణీదారులకు డబ్బులు చెల్లించాల్సిన బాధ్యత ఉంది. అయితే డబ్బులు ఇవ్వకపోవడంతో డిస్టిబ్యూటర్స్ పూరి జగన్నాథ్ ను టార్గెట్ చేశారు.

లైగర్ సినిమా డిజాస్టర్ గా నిలవడంతో పూరి జగన్నాథ్ ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో పడ్డారు. పూరి జగన్నాథ్ కు చెందిన పూరి కనెక్ట్స్ ఎల్ఎల్ పి ఆధ్వర్యంలో పూరీ జగన్నాధ్ లైగర్ సినిమాను నిర్మించారు. సినిమా డిస్ట్రిబ్యూషన్ వ్యవహారంలో వరంగల్ శ్రీనుతో ఏప్రిల్ 12వ తేదీన ఒప్పందం చేసుకున్నారు. సినిమా నష్టాల పాలు కావటంతో ఎగ్జిబిటర్లు అంతా నేడు జూబ్లీహిల్స్లోని పూరీజగన్నాథ్ ఇంటి ముందు ధర్నా చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు.

దీని కోసం పూరి ఒక నెల రోజులు గడువు కోరినప్పటికీ కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్‌ మాత్రం పూరి జగన్నాథ్ ఆఫీస్‌ ముందు ధర్నా చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలిసిన పూరి జగన్నాథ్‌ తన పరువు తీయాలని చూస్తే మాత్రం ఒక్క పైసా కూడా ఇవ్వనని వార్నింగ్‌ ఇచ్చాడు. ఈమేరకు ఓ ఆడియోకాల్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా పూరీ జగన్నాథ్ తన ఇంటిపై దాడి చేసే అవకాశం ఉందన్న అనుమానంతో రక్షణ కోరుతూ పోలీసులకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో పూరి ఇంటి ముందు భారీగా పోలీసులు మోహరించారు.

  Last Updated: 27 Oct 2022, 03:28 PM IST