Site icon HashtagU Telugu

Telangana Jobs: పోలీస్ శాఖ నుంచే.. ఉద్యోగాల జాత‌ర షురూ..!

Police Recruitment In Telangana

Police Recruitment In Telangana

తెలంగాణలో ఉద్యోగాల జాతార మొద‌లు కానుంది. ఈ క్ర‌మంలో ముందుగా పోలీసు శాఖ నుంచి ఉద్యోగాల భర్తీ ప్రారంభం కానుందని స‌మాచారం. మార్చి చివ‌రి వారంలో కానీ, ఏప్రిల్ మొద‌టి వారంలో కానీ పోలీస్ శాఖ నుంచి ప్ర‌క‌ట‌న వెలువేడే అవ‌కాశం ఉంది. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే రాష్ట్రంలో జోన్ల వారిగా ఉద్యోగాల ఖాళీల జాబితాను అధికారులు సిద్ధం చేసి, ప్ర‌భుత్వానికి పంపార‌ని, దీంతో ఆ జాబితాను ప్ర‌భుత్వం ఆమోదం తెలిపిన వెంట‌నే నియామ‌క ప్ర‌క్రియ ప్రారంభిస్తార‌ని స‌మాచారం.
ఈనెలాఖరు లేదంటే వచ్చే నెల మొదటివారంలో ఉద్యోగ ప్రకటన వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

ఇక తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ శాఖలో దాదాపు 18వేలకు పైగా ఖాళీలు ఉన్న‌ట్టు అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి కసరత్తు మొదలు పెట్టింది. 2018లో పోలీస్ శాఖ 16 వేల ఉద్యోగాల భర్తీ చేసిన సంగ‌తి తెలిసిందే. త్వరలోనే పోలీస్ శాఖలో భర్తీలు పూర్తి చేస్తామని ఇటీవల హోంమంత్రి ప్రకటించారు. దీనికి తగ్గట్టుగానే నియామక మండలి సిద్ధమైంది. కొత్త జిల్లాలు, జోన్ల వారీగా ఖాళీల వివరాలను సేకరించింది. గత ఏడాది జూలైలోనే నియామకాలకు సంబంధించి ప్రకటన వస్తుందని భావించింది. చివరి నిమిషంలో ఉద్యోగ ప్రకటన వాయిదా పడింది. తాజాగా సీఎం కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో త్వరలో నోటిఫికేషన్‌ రానుంది.