Site icon HashtagU Telugu

Hyderabad: జూబ్లీహిల్స్​ చెక్​పోస్ట్ ​వద్ద కరెంట్ షాక్​తో కానిస్టేబుల్​ఒకరు మృతి

Hyderabad

Mcms

Hyderabad: హైదరాబాద్ మహా నగరంలో వర్షాలు పడితే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతకాల్సిందే. ఎక్కడ మ్యాన్ హొల్స్ తెరిచి ఉంటాయో తెలియదు. ఎక్కడ విద్యుత్తు ప్రమాదాలు జరుగుతాయో తెలియదు. గత రాత్రి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద గ్రే హౌండ్స్ కానిస్టేబుల్ మృతి ఆందోళన కలిగిస్తుంది. గండిపేట గ్రే హౌండ్స్​లో పనిచేసే వీరాస్వామి(45) జూబ్లీహిల్స్​ చెక్​పోస్ట్ ​వద్ద కరెంట్ షాక్​తో అక్కడికక్కడే మరణించాడు.

వీరాస్వామి తమ్ముడు హైదరాబాద్ యూసఫ్ గూడలో నివాసం ఉంటున్నాడు. ఆదివారం కావడంతో తన తమ్ముడిని చూసేందుకు యూసఫ్ గూడా వచ్చాడు. రోజంతా సంతోషంగా గడిపి రాత్రి గండిపేట బయలుదేరాడు. అయితే జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్దకు రాగానే ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. బైక్ పై వెళ్తున్న వీరాస్వామి స్కిడ్ అయి పక్కనే ఉన్న విద్యుత్తు స్థంబానికి తాకాడు. భారీ వర్షం కారణంగా ఆ స్థంబానికి విద్యుత్ ప్రవహిస్తుంది. దీంతో వీరాస్వామి విద్యుత్ షాక్ కు గురయ్యాడు. పోలీసులు వెంటనే అతడిని అంబులెన్స్​లో జూబ్లీహిల్స్ ​అపోలోకు తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో గత మూడు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అకాల వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతులు పంట నష్టపోయారు. కాగా తాజా వెదర్ రిపోర్ట్ ప్రకారం చూస్తే రెండు రోజుల్లో వర్షాలు తగ్గుముఖం పడతాయని తెలిపింది.

Read More: Suicide : పుణెలో రేప్‌కేసులో నిందితుడు ఆత్మ‌హ‌త్య‌