Site icon HashtagU Telugu

Constable Arrested: కానిస్టేబుళ్ల అక్రమాలు…అర్థరాత్రి జంటను బెదిరించి…!!

Crime

Crime

ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులే బెదిరింపులకు పాల్పడుతూ డబ్బు వసూలు చేస్తున్నారు. తాజాగా బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో హోంగార్డు, కానిస్టేబుల్ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈ ఘటన తాజాగా వెలుగుచూసింది. ఈ మధ్య అర్థరాత్రి ఒక జంటను బెదిరించి…వాళ్ల దగ్గరి నుంచి 15,000రూపాయలు హోంగార్డు, కానిస్టేబుల్ తీసుకున్నారు.

గూగుల్ పే ద్వారా ఈ డబ్బును తమ అకౌంట్లోకి ట్రాన్స్ ఫర్ చేసుకున్నారు. అంతటితో ఆగలేదు. మరుసటి రోజు మళ్లీ బెదిరించారు. ఇంకొన్ని డబ్బులు వసూలు చేసారు. చివరకు వీళ్ల వేధింపులు భరించలేక బాధితులు స్థానిక సర్కిల్ ఇన్ స్పెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అక్రమ వసూళ్లకు పాల్పడ్డ హోంగార్డు, కానిస్టేబుల్ ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Exit mobile version