Hyderabad: పోలీసుల ముమ్మర తనిఖీలు.. భారీగా పీడీఎస్ బియ్యం పట్టివేత

  • Written By:
  • Updated On - May 10, 2024 / 02:10 PM IST

Hyderabad: ఎన్నికలు సమీపిస్తుండటంతో పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా రవాణా చేస్తున్న పీడీఎస్ బియ్యం, ఇతర వస్తువులను  సైబరాబాద్ ఎస్ వోటీ బృందాలు పట్టుకున్నాయి. రూ.10,60,000 విలువ చేసే 53 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నాయి. 35 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న జీజే 25 యూ 9238 లారీని ఎస్ వోటీ శంషాబాద్ పోలీసులు పట్టుకున్నారు. పోతుల బాల ప్రదీప్ పరారీలో ఉన్నాడు. అక్రమ రవాణా చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. పీడీఎస్ రైస్ తో పాటు ఇద్దరు డ్రైవర్లు, వాహనాన్ని పోలీస్ స్టేషన్ కు తరలించారు షాద్ నగర్ పోలీసులు..

సూరారం ప్రధాన రహదారి వద్ద వాహన తనిఖీలు నిర్వహించిన ఎస్ వోటీ మేడ్చల్ బృందం రూ.32,54,400/డబ్బును పట్టుకున్నారు. సూరారం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఎస్ వోటీ బాలానగర్ బృందం కేపీహెచ్ బీలోని మోర్ సూపర్ మార్కెట్ వద్ద వాహన తనిఖీలు నిర్వహించి రూ. 1,77,532/డబ్బు దొరికింది. ఇవే కాకుండా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో అక్రమ డబ్బు పట్టుబడింది. అయితే పోలీసులు ఎక్కడ పడితే అక్కడ తనిఖీలు నిర్వహిస్తుండటంతో దళారులు వివిధ మార్గాల్లో డబ్బును తరలిస్తూ దొరికిపోతున్నారు.