MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత కారును తనిఖీ చేసిన పోలీసులు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  ప్రయాణిస్తున్న కారును తనిఖీ చేసిన ఎన్నికల కమిషన్ అధికారులు తనిఖీ చేశారు.

  • Written By:
  • Publish Date - November 7, 2023 / 12:28 PM IST

MLC Kavitha: ఎన్నికల ప్రచారం లో భాగంగా నిజామాబాద్ లో పర్యటిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  ప్రయాణిస్తున్న కారును తనిఖీ చేసిన ఎన్నికల కమిషన్ అధికారులు తనిఖీ చేశారు. దీంతో కారులో నుంచి దిగి తనిఖీలకు సహకరించారు ఎమ్మెల్సీ కవిత. కారును క్షుణ్ణంగా అధికారులు తనిఖీ చేశారు. తనిఖీలకు సహకరించినందుకుగానూ ఎమ్మెల్సీ కవితకు కృతజ్ఞతలు పోలీసులు థ్యాంక్స్ చెప్పారు. తనిఖీల్లో భాగంగా పోలీసులు మంత్రులు, ఎమ్మెల్యేల కార్లను తనిఖీ చేస్తున్నారు.

కాగా శాసనసభకు జరిగే ఎన్నికలకు హైదరాబాద్‌ జిల్లాలో సోమవారం 25 మంది అభ్యర్థులు 27 నామినేషన్లు దాఖలు చేయగా.. మొత్తం 47 నామినేషన్లు, 42 మంది దాఖలు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌రోస్‌ తెలిపారు. ముషీరాబాద్‌ నియోజకవర్గంలో రెండు నామినేషన్లు దాఖలు చేయగా..అందులో ఇండిపెండెంట్‌ అభ్యర్థి రెడ్డి మల్ల పార్వతి, ధర్మ సమాజ్‌ పార్టీ అభ్యర్థి ముత్యాల రాజేశ్‌ నామినేషన్‌ వేశారు. మలక్‌పేట్‌ నియోజకవర్గంలో ఏఐఎంఐఎం పార్టీ అభ్యర్థి అహ్మద్‌ బిన్‌ అబ్దుల్లా బలాల, ఇండిపెండెంట్‌ అభ్యర్థులు ఎల్‌.అశోక్‌ నాథ్‌, భార్గవి కజాయం, పోలం శ్రీనివాస్‌, మహ్మద్‌ అక్రం అలీ ఖాన్‌ నామినేషన్లు వేశారు. అంబర్‌పేట్‌ నియోజకవర్గంలో ఇండిపెండెంట్‌ అభ్యర్థి పొన్నపాటి చిన్న లింగన్న నామినేషన్‌ దాఖలు చేశారు.