Lokesh Convoy: ఒకేరోజు రెండు సార్లు లోకేష్ కాన్వాయ్‌ను చెక్ చేసిన పోలీసులు.. వీడియో

ఏపీలో ఎన్నిక‌ల సంద‌డి నెల‌కొంది. ఈ క్ర‌మంలోనే కేంద్ర‌, రాష్ట్ర ఎన్నిక‌ల సంఘాలు కొన్ని నియ‌మ నిబంధ‌న‌లు అమలు చేసింది. ఈ క్ర‌మంలోనే టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ కాన్వాయ్‌ (Lokesh Convoy)ను పోలీసులు ఒకేరోజులో రెండు సార్లు చెక్ చేయాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది.

Published By: HashtagU Telugu Desk
Lokesh Convoy

Safeimagekit Resized Img (4) 11zon

Lokesh Convoy: ఏపీలో ఎన్నిక‌ల సంద‌డి నెల‌కొంది. ఈ క్ర‌మంలోనే కేంద్ర‌, రాష్ట్ర ఎన్నిక‌ల సంఘాలు కొన్ని నియ‌మ నిబంధ‌న‌లు అమలు చేసింది. ఆ నిబంధ‌న‌లు అదుపు త‌ప్ప‌కుండా పోలీసులు ఎప్ప‌టిక‌ప్పుడు త‌నిఖీలు చేస్తూనే ఉన్నారు. ఈ క్ర‌మంలోనే టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ కాన్వాయ్‌ (Lokesh Convoy)ను పోలీసులు ఒకేరోజులో రెండు సార్లు చెక్ చేయాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. మూడు రోజుల్లో నాలుగు సార్లు లోకేష్ కాన్వాయ్ ఆపి పోలీసులు చెక్ చేశారు. తాజాగా ఆదివారం ఉండవల్లి కరకట్ట వద్ద టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కాన్వాయ్ రెండోసారి ఆపి పోలీసులు తనిఖీ చేశారు. కోడ్ అమలులో భాగంగానే తనిఖీ చేస్తున్నామని నారా లోకేష్‌కు పోలీసులు చెప్పిన‌ట్లు స‌మాచారం. తనిఖీలకు నారా లోకేష్ కూడా స‌హ‌క‌రించారు.

Also Read: Mahasena Rajesh : చంద్రబాబు నాకు ఏ హామీ ఇవ్వలేదు – మహాసేన రాజేష్

అంతేకాకుండా వైసీపీ నేతల కార్లు ఎందుకు ఆపి చెక్ చేయడం లేదు అని పోలీసుల్ని లోకేష్ ప్ర‌శ్నించారు. ఒక్క టిడిపి నేతల వాహనాలు మాత్రమే ఆపాలని ఆదేశాలు ఏమైనా ఉన్నాయా అని అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. కాన్వాయ్ లో ఉన్న కార్లన్నింటినీ పోలీసులు త‌నిఖీ చేశారు. మంగళగిరి నియోజకవర్గంలో వివిధ గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనడానికి నారా లోకేష్ వెళ్తుండ‌గా కాన్వాయ్ ఆపి పోలీసులు తనిఖీ చేశారు. కాన్వాయ్ లో కోడ్ కు విరుద్ధంగా ఏమీ లేదని పోలీసులు నిర్ధారించారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించకుండా లోకేష్ ప్రచారం సాగుతోందని పోలీసుల తెలిపారు. కోడ్ వచ్చిన తరువాత ఇప్పటికి నాలుగు సార్లు లోకేష్ కాన్వాయ్ ను పోలీసులు ఆపి త‌నిఖీ చేశారు.

We’re now on WhatsApp : Click to Join

  Last Updated: 24 Mar 2024, 05:50 PM IST