Site icon HashtagU Telugu

BJP MLA : బీజేపీ ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్‌రావుపై అబిడ్స్ పీఎస్‌లో కేసు… అవి బ‌య‌ట‌పెట్టినందుకే..?

Raghunandan Rape

Raghunandan Rape

బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై అబిడ్స్ పోలీస్ స్టేష‌న్ లో కేసు న‌మోదు అయింది. హైద‌రాబాద్‌లోని జూబ్లిహిల్స్ లో ఇటీవ‌ల మైనర్ బాలికపై జరిగిన అత్యాచార సంఘటనలో నింధితులను అరెస్ట్ చేయాలని ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో బాలిక అత్యాచార సంఘటనకు సంబంధించి కొన్ని ఫొటోలను, ఒక వీడియోను బయట పెట్టారు. బెంజ్ కారులో జరిగిన దృశ్యాలను రఘునందన్ మీడియా ఎదుట బహిర్గతం చేశారు. ఈ వీడియోలో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి.అయితే వీడియోలను బహిర్గతం చేసినందుకుగాను అబిడ్స్ పోలీసులు ఐపీసీ 228(ఏ) సెక్షన్ కింద రఘునందన్ రావుపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. సుప్రింకోర్టు ఆదేశాల మేరకు అఘాయిత్యానికి గురైన బాధితుల వివరాలు బయట పెట్టొద్దు. అలాచేస్తే నేరంగా పరిగణిస్తారు. ఈ కోణంలోనే బీజేపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే రఘునందన్ రావు ఈ విషయంపై స్పందించారు. తాను చూపించిన వీడియోలో ఎక్కడ బాధితురాలి ముఖం కనిపించలేదని తెలిపారు

Exit mobile version