వివాదాలకు చాల దూరంగా ఉండే అక్కినేని నాగార్జున ఫ్యామిలీ (Akkineni Nagarjuna Family)..తాజాగా వివాదంలో నిలిచింది. చిత్రసీమలో యువసామ్రాట్ గా , కింగ్ గా , మన్మధుడి గా ఇలా అనేక విధాలుగా పిలువబడే నాగార్జున (Akkineni Nagarjuna)..ప్రస్తుతం హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. కేవలం నాగార్జున మాత్రమేకాదు..ఆయన కొడుకులు నాగ చైతన్య , అఖిల్ లు సైతం హిట్ లేక ఇబ్బంది పడుతున్నారు. ఒక్క హిట్ అయినా కొట్టండి బాబు అంటూ అభిమానులు ఎదురుచూస్తున్నారు. నిన్న మొన్న వచ్చిన హీరోలు పాన్ ఇండియా హిట్లు కొడుతుంటే..ఎంతో బ్యాక్ గ్రౌండ్ ఉన్న నాగ్ ఫ్యామిలీ హీరోలు మాత్రం పాన్ హిట్ కాదు కదా..మాములు బ్లాక్ బస్టర్ హిట్ అయినా ఇంతవరకు కొట్టలేదు.
ఇదిలా ఉంటె తాజాగా నాగ్ ఫ్యామిలీ వివాదంలో చిక్కుకుంది. నాగార్జున సోదరి నాగసుశీల (Nagarjuna Sister Naga Susheela)పై పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీజ ప్రకృతి దర్శపీఠం ఆశ్రయంపై ఈ నెల 12న నాగసుశీల, ఆమె అనుచరులు దాడికి పాల్పడ్డారట. దర్శపీఠ నిర్వాహకులు శ్రీనివాసరావు (Srinivasrao)పై వీరు దాడి చేశారని ఆరోపిస్తూ మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు నాగ సుశీలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఘటనపై దర్యాప్తు మొదలుపెట్టారు.
గతంలో నాగసుశీల తన వ్యాపార భాగస్వామిపై క్రిమినల్ కేసు పెట్టారు. తమకు తెలియకుండా తమ భూమిని విక్రయించారని ఆరోపిస్తూ నిర్మాత చింతలపూడి శ్రీనివాసరావుపై హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో నాగసుశీల ఫిర్యాదు చేసి వార్తల్లో నిలిచారు. తన భూమిని విక్రయించి నగదు దుర్వినియోగం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
Read Also : AP BJP : స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లకు సీఐడీ వెళ్లిందా..? : ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి
నాగసుశీల, శ్రీనివాసరావు చాలా ఏళ్లుగా వ్యాపార భాగస్వాములుగా ఉన్నారు. వీరిద్దరూ కలసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడంతో పాటు సినిమాలు కూడా నిర్మించారు. సుశాంత్‌ను హీరోగా పెట్టి నాగసుశీల, శ్రీనివాసరావు కలసి శ్రీనాగ్ కార్పోరేషన్ బ్యానర్‌పై మూడు సినిమాలు నిర్మించారు. వాటిలో ‘కరెంట్’ సినిమా ఫర్వాలేదనిపించినా.. ఆ తరవాత వచ్చిన ‘అడ్డా’ ,‘ఆటాడుకుందాం రా’ సినిమాలు ప్లాప్ అయ్యి భారీ నష్టాలూ తెచ్చిపెట్టాయి. అప్పటికే భూమి విషయంలో వీరిద్దరి మధ్య ఉన్న మనస్పర్థలు ఈ సినిమాల పరాజయాలతో మరింత ఎక్కువైనట్లు సమాచారం. ,‘ఆటాడుకుందాం రా’ సినిమా కోసం శ్రీనివాసరావు రూ.5 కోట్లు సమకూర్చినట్లు తెలుస్తోంది. అయితే సినిమా పరాజయంతో నష్టం రావడంతో వీరిద్దరి మధ్య దూరం పెరిగింది. ఈ నేపథ్యంలోనే తనపై తప్పుడు కేసులు పెట్టారని శ్రీనివాసరావు ఆరోపించిన్నట్లు సమాచారం. మొత్తం మీద వివాదాస్పద వార్తల్లో నాగ సుశీల పేరు ఇప్పుడు వైరల్ గా మారింది.