Site icon HashtagU Telugu

Nayanthara: నటి నయనతారపై పోలీస్ కేసు, కారణమిదే

Nayanthara

Nayanthara

Nayanthara: నయనతార అన్నపూరణి మూవీ లో నటించిన విషయం తెలిసిందే. ఆమె తో పాటు అన్నపూరణి మూవీకి చెందిన మరో ఏడుగురిపై బజరంగ్ దళ్ కార్యకర్తలు ఓషివారా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మూవీ శ్రీరాముడిని కించపరిచేలా ఉందంటూ హిందూ ఐటీ సెల్ వ్యవస్థాపకుడు, దక్షిణ ముంబయికి చెందిన రమేశ్ సోలంకీ లోకమాన్య తిలక్ మార్గ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అన్నపూరణి మూవీ లవ్ జిహాద్ ను ప్రోత్సహించేలా ఉందని కూడా ఆయన పేర్కొన్నారు.

నయనతారపై పోలీసులు కేసు పెట్టారు. ఆమె నటించిన అన్నపూరణి మూవీ ఇటీవల వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. దీంతో నెట్ ఫ్లిక్స్ ఈ మూవీని తన ఓటిటి ప్లాట్ ఫామ్ నుంచి తొలగించింది. ఈ సినిమా హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఉందంటూ మహారాష్ట్రలోని మీరా భయాండర్ కు చెందిన 48 ఏళ్ల వ్యక్తి నయా నగర్ పోలీసులకు కంప్లయింట్ చేశారు. ఈ మేరకు పోలీసులు నయనతార, మూవీ నిర్మాతతోపాటు మరో ఆరుగురిపై కేసు నమోదు చేశారు.

తమిళనాడులోని ఓ ఆలయంలో వంటవాడిగా పనిచేసే రంగరాజ్ కుమార్తె అన్నపూరణి. తండ్రిలాగ తాను కూడా చెఫ్ కావాలనుకుంటుంది. అయితే బ్రాహ్మణ కులంలో పుట్టిన కుమార్తె మాంసంతో వంటకాలు చేయడం పాపమని తండ్రి వాదిస్తాడు. ఈ నేపథ్యంలో అన్నపూరణి ఏం చేసిందనేది కథ. ఈ మూవీ వివాదంపై మేకర్స్ ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.