Turtles: తాబేళ్లను తరలిస్తున్న ముఠా అరెస్ట్!

కృష్ణా జిల్లా కొల్లేరు ప్రాంతం నుంచి ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తాబేళ్లను తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.

  • Written By:
  • Publish Date - March 1, 2022 / 11:06 AM IST

కృష్ణా జిల్లా కొల్లేరు ప్రాంతం నుంచి ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తాబేళ్లను తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. రెండురోజుల క్రితం వడర్లపాడు గ్రామం వద్ద రూరల్ ఎస్ఐ చల్లా కృష్ణ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహించగా.. మినీ వ్యాన్ లో 25 బస్తాల్లో నాలుగు టన్నుల తాబేళ్లు లభ్యమయ్యాయి. తాబేలును రూ. 15కి కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాల్లో రూ. 50 నుంచి రూ.100 కు విక్రయిస్తున్నారు. ఈ తాబేళ్ల మాంసానికి డిమాండ్ బాగా పెరిగింది. ‘వైల్డ్ లైఫ్ ఏలూరు ఫారెస్ట్ రేంజ్’ అధికారి కుమార్ ఆధ్వర్యంలో డిప్యూటీ రేంజ్ అధికారి జయ ప్రకాష్, బీట్ ఆఫీసర్ రాజేష్ లు నిందితులపై అటవీ పర్యావరణ చట్టం 1972 సెక్షన్ 1972 కింద కేసు నమోదు చేసి కైకలూరు కోర్టుకు తరలించారు. పట్టుకున్న తాబేళ్లను మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు కొల్లేరు సరస్సులో వదులుతామని అధికారులు తెలిపారు.