Site icon HashtagU Telugu

Ganja : కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో గంజాయి స‌ర‌ఫ‌రా.. యువ‌కుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

Ganja

Ganja

కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో గంజాయి త‌ర‌లిస్తున్న యువ‌కుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బీహార్‌కు చెందిన 21 ఏళ్ల యువకుడిని బుధవారం తన సూట్‌కేస్‌లో గంజాయి కలిగి ఉన్నందుకు అరెస్టు చేశారు. ఉదయం 10:45 గంటలకు సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ డి రమేష్‌ రైలును తనిఖీ చేస్తుండగా ఓ వ్యక్తి బరువైన సూట్‌కేస్‌ను కలిగి ఉన్నట్లు గుర్తించారు. అతను తన బెర్త్ కింద అనుమానాస్పదంగా ఉండ‌టంతో పోలీసులు అత‌న్ని ప్ర‌శ్నించారు. సూట్‌కేస్ గురించి అడగ్గా ఆ వ్యక్తి గంజాయిని కలిగి ఉన్నానని ఒప్పుకున్నాడు. ఎరుపు రంగు సూట్‌కేస్‌లో నిల్వ ఉంచిన గంజాయి కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లోని భువనేశ్వర్ రైల్వే స్టేషన్ నుండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వరకు తీసుకువ‌చ్చాడు. గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు దాని విలువ‌ రూ.2,40,000 ఉంటుందని గుర్తించారు. నిందితుడి నుంచి వీవో మొబైల్‌ ఫోన్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.