Site icon HashtagU Telugu

KTR: కేటీఆర్ రెండు జిల్లాల పర్యటన.. విపక్షాల అరెస్టులు

Telangana

Ktr

KTR: తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ఈ రోజు సిద్ధిపేట, వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. రెండు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. కేటీఆర్ ని బీజేపీ అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని సమాచారం మేరకు రెండు జిల్లాలో బీజేపీ లీడర్లను అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు.

మే 5 శుక్రవారం మంత్రి కేటీఆర్ రెండు జిల్లాల పర్యటనలో భాగంగా దాదాపు రూ.214.51 కోట్లతో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. హుస్నాబాద్‌లో రూ.33.51 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు మంత్రి. అనంతరం డిపో గ్రౌండ్‌లో భారీ బహిరంగసభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటలకు భోజనం, 2.30 గంటలకు హుస్నాబాద్‌ నుంచి హనుమకొండ పర్యటనకు వెళ్తారు. హనుమకొండలో 181 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. సాయంత్రం 5 గంటలకు హనుమకొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని సందర్శించి ప్రారంభించనున్నారు.

సిద్దిపేట, వరంగల్ జిల్లాలో ప్రతిపక్ష నేతలను ముందస్తు అరెస్ట్ చేశారు పోలీసులు. కేటీఆర్ ను అడ్డుకుంటారనే ఉద్దేశంతో సిద్దిపేటలో బీజేపీ, సీపీఐ నాయకులను అదుపులోకి తీసుకున్నారు.బీజేపీ 4వ డివిజన్ అధ్యక్షుడు గొర్రె ఓం ప్రకాశ్ యాదవ్, AIYF రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సయ్యద్ వలీ ఉల్లా ఖాద్రిని అదుపులోకి తీసుకున్నారు హనుమకొండ పోలీసులు. 46 డివిజన్ అధ్యక్షుడు ముత్తోజు సురేష్, జిల్లా నాయకులు గడ్డం మహేందర్ ను అరెస్టు చేసి మడికొండ పీఎస్ కు తరలించారు.

Read More: India vs Pakistan: వన్డే క్రికెట్ ప్రపంచ కప్ లో భారత్, పాక్ మ్యాచ్ ఎప్పుడు.. ఎక్కడంటే..?

Exit mobile version