Site icon HashtagU Telugu

Jr. NTR : జూనియ‌ర్ ఎన్టీఆర్ అభిమానుల‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. కార‌ణం ఇదే..?

Jr Ntr

Jr Ntr

టాలీవుడ్ స్టార్ హీరో జూనియ‌ర్ ఎన్టీఆర్ అభిమానుల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. జూనియ‌ర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా మేకలను బలి ఇచ్చినందుకు తొమ్మిది మందిపై రాబర్సన్‌పేట పోలీసులు కేసు న‌మోదు చేశారు. జూనియ‌ర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఫిల్మ్ థియేటర్‌లోని ఫ్లెక్సీ బ్యానర్‌లపై అభిమానులు రెండు మేకలను బలి ఇచ్చి వాటి రక్తాన్ని చిందించారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. అరెస్టయిన వ్యక్తులను పి. శివ నాగరాజు, కె. సాయి, జి. సాయి, డి. నాగ భూషణం, వి. సాయి, పి. నాగేశ్వరరావు, వై. ధరణి, పి. శివ, బి. అనిల్ కుమార్‌లుగా గుర్తించారు.