Site icon HashtagU Telugu

Karimnagar: కరీంనగర్‌లో 10 మంది ప్రైవేట్ వడ్డీ వ్యాపారులు అరెస్ట్‌..!

Police Arrest 10 Private Moneylenders In Karimnagar

Police Arrest 10 Private Moneylenders In Karimnagar

తెలంగాణలోని కరీంనగర్‌లో ప్రైవేట్ వడ్డీ వ్యాపారులపై దాడులు నిర్వహించి 10 మందిని అరెస్టు చేశారు. ఈ క్ర‌మంలో అరెస్టూన 10 మంది ఫైనాన్షియ‌ర్ల నుంచి రూ.52.57 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ వడ్డీ వ్యాపారాలకు సంబంధించి కరీంనగర్ పోలీసులు బుధ‌వారం 37 చోట్ల దాడులు చేశారు. దాడుల‌లో భాగంగా పలువురు నాయకుల నుంచి రూ.52.57 లక్షల నగదు, సంతకాలు చేసిన ప్రామిసరీ నోట్లు, ఖాళీ చెక్కులు, ఇతర పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

ఇక‌పోతే పోలీసులు హుజూరాబాద్‌లో ఆరు కేసులు నమోదు చేయగా, కరీంనగర్ మండలంలో నాలుగు కేసులు నమోదయ్యాయి. వడ్డీ వ్యాపారులు ఖాతాదారుల నుంచి 5 నుంచి 10 శాతం వడ్డీ వసూలు చేసేవారని కరీంనగర్ సీపీ వి.సత్యనారాయణ తెలిపారు. నిందితులు సెక్యూరిటీగా వినియోగదారుల ఆస్తులను సీజ్ చేసేవారని విచార‌ణంలో భాగంగా అక్క‌డి స్థానిక‌లు తెలిపారు. అంతే కాకుండా కొన్ని ఘటనల్లో వేధింపులు భరించలేక చాలామంది క‌స్ట‌మ‌ర్లు ఆత్మహత్యలు చేసుకున్నారని పోలీసుల‌కు స్థానికులు తెలిపారు.