Site icon HashtagU Telugu

Election Code: ఎన్నికల ప్రవర్తనా నియమావళి కింద పోలీసుల యాక్షన్

Election Code

Election Code

Election Code: ఎన్నికల ప్రవర్తనా నియమావళి కింద శుక్రవారం 2,56,84,671 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంటే ఎన్నికల షెడ్యూల్ నాటి నుండి ఈ రోజు వరకు మొత్తం 42,28,92,639 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో 28 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. ఈ రోజు 10 ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 4,449 ఆయుధాలు సీజ్ అయ్యాయి. ఈరోజు సీఆర్‌పీసీ కింద 43 కేసులు ఉండగా ఇప్పటివరకు 586 కేసులు నమోదయ్యాయి. ఈరోజు 145 బైండోవర్లు చేయగా ఇప్పటి వరకు 1609 బైండోవర్లు జరిగాయి. ఈరోజు 58 నాన్ బెయిలబుల్ వారెంట్లు ఉండగా మొత్తం 715 కేసులు నమోదయ్యాయి.

శుక్రవారం ఎంసీసీ పరిధిలోని పబ్లిక్ ప్రాపర్టీల నుంచి 57 గోడలపై రాసిన రాతలను తొలగించగా, ఇప్పటివరకు 5147 తొలగించారు. ఈరోజు మొత్తం 72,847 పోస్టర్లలో 1048 పోస్టర్లు తొలగించబడ్డాయి. ఈరోజు 364 బ్యానర్లు తొలగించగా ఇప్పటివరకు 23,856 బ్యానర్లు తొలగించారు. ఈరోజు 1114 విగ్రహాలను కప్పివేయగా.. మొత్తం 78,407 విగ్రహాలను మూసేశారు.

ఈరోజు ప్రైవేట్ ప్రాపర్టీలలో 163 ​​పోస్టర్లను తొలగించగా, ఇప్పటివరకు 19,591 పోస్టర్లను తొలగించారు. ఈరోజు 77 బ్యానర్లు తొలగించగా ఇప్పటి వరకు 4,863 బ్యానర్లు తొలగించారు ఎక్సైజ్ శాఖ శుక్రవారం 2129 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకుంది.

Also Read: Babu Mohan : బిజెపి కి రాజీనామా చేసే ఆలోచనలో బాబు మోహన్..?