పోలవరం ప్రాజెక్ట్(Polavaram Project)పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. అసెంబ్లీ లో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) మాట్లాడుతూ.. ప్రస్తుతం పోలవరం పనులు 73% పూర్తయ్యాయి. మిగతా పనులు వేగంగా కొనసాగించి, 2027 నాటికి పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పోలవరం ద్వారా గోదావరి నదిలో ప్రతి సంవత్సరం సముద్రంలో కలిసిపోతున్న 2వేల టీఎంసీల నీటిని రాయలసీమ, దక్షిణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలకు మళ్లించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. ఈ నీటిని వినియోగించుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం-బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టును ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. అంతేగాక హంద్రీనీవా కాలువ వెడల్పు పనులు, వెలిగొండ ప్రాజెక్టు, చింతలపూడి ఎత్తిపోతల పథకం, వంశధార ఫేజ్-2 వంటి కీలక నీటి ప్రాజెక్టుల పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయని వివరించారు.
Chalisa: ప్రతిరోజూ స్నానం చేసిన తర్వాత ఈ చాలీసా పఠించండి!
పోలవరం ప్రాజెక్టును నిర్దేశిత గడువులో పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం సహాయపడుతుందని, ఇంకా రావాల్సిన నిధులను త్వరగా కేంద్రం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. ప్రాజెక్టు పనులకు అవసరమైన నిధులను సమయానికి విడుదల చేయాలని, పోలవరం పూర్తయితే రాష్ట్ర వ్యవసాయరంగం తిరిగి బలపడుతుందని మంత్రి పేర్కొన్నారు. పోలవరం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా నీటి అవసరాలు తీర్చడంతో పాటు, విద్యుత్ ఉత్పత్తి, తాగునీటి సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం అవుతుందని ప్రభుత్వం ధృడంగా నమ్ముతోంది.