Site icon HashtagU Telugu

Polavaram Project : డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు మొదలు

Polavaram Diaphragm Wall Up

Polavaram Diaphragm Wall Up

ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం (Polavaram ) ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రమ్ వాల్ (Polavaram Diaphragm Wall) నిర్మాణం రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పోలవరం ప్రాజెక్టు విజయవంతంగా పూర్తవడానికి చాలా అవసరం. భవర్ కంపెనీ ఈ పనిని చేపట్టనుంది. ఇందులో టీ-5 ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమం ఉపయోగించబడుతుంది. ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని 2025 చివరికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నిర్మాణం పూర్తి అయితే, తదుపరి ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణం మొదలు పెట్టాల్సి ఉంటుంది.

CM Chandrababu : నేడు సాయంత్రం టీడీపీ మంత్రులు, ఎంపీలతో చంద్రబాబు కీలక భేటీ..

ఈ పనులు సమయానికి పూర్తి కావాలని అధికారులు కృషి చేస్తున్నారు. 2016లోనే పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ప్రారంభమైంది. అయితే, 2020 తరువాత వరదలు రావడం తో కొంత భాగం కొట్టుకుపోయింది. ఈ కారణంగా డయాఫ్రమ్ వాల్ పనులు కొంత ఆలస్యమయ్యాయి. ప్రస్తుతం పనులు తిరిగి ప్రారంభం కావడంతో ప్రాజెక్టు పూర్తి కావడానికి మరింత వేగం పూజుంకున్నట్లు అయ్యింది. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే రాష్ట్రానికి అనేక రకాల ప్రయోజనాలు కలగనున్నాయి.