ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. నవరత్నాలతో పాటు పలు వినూత్న కార్యక్రమాలను ప్రత్యేకించి పాఠశాలల్లో నాడు-నేడు పనులతో పాఠశాలలకు కొత్త మెరుగులు దిద్దేందుకు చేపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు పూర్తికాగా మిగిలిన ప్రాంతాల్లో పనులు కొనసాగుతున్నాయి. కాగా, నాడు-నేడు పనుల కోసం ఓ ప్రముఖ సంస్థ భారీ విరాళాన్ని ప్రకటించింది. ఈ పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం పోకర్ణ గ్రూప్ కోటి రూపాయలను విరాళంగా అందజేసింది. మంగళవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిసి కంపెనీ సీఈవో గౌతమ్‌చంద్ జైన్ చెక్కును అందజేశారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) కింద పోకర్ణ నిధులు సమకూర్చింది.
Pokarna Group: పాఠశాలల అభివృద్ధికి ‘పోకర్ణ’ కోటి విరాళం!

Pokarna Group