PM Modi: ఇది ఫ్రెండ్లీ, ప్రోగ్రెసివ్ బడ్జెట్!

కేంద్ర బడ్జెట్‌పై ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. ఇది ప్రగతిశీల బడ్జెట్‌ అని, ఈ బడ్జెట్‌ని ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు అభినందనలు తెలియజేశారు.

  • Written By:
  • Updated On - February 1, 2022 / 05:22 PM IST

కేంద్ర బడ్జెట్‌పై ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. ఇది ప్రగతిశీల బడ్జెట్‌ అని, ఈ బడ్జెట్‌ని ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు అభినందనలు తెలియజేశారు. మన జీవన విధానంలో అన్ని రంగాల్లో సాంకేతికత చేరిందనీ, వ్యవసాయ రంగంలో డ్రోన్లు వచ్చి చేరాయని అన్నారు. ప్రతి పేద వాడికి సొంతిల్లు ఉండాలని, ప్రతి ఇంటికి అంతర్జాల సౌకర్యం ఉండాలని మోడీ వెల్లడించారు.

కిసాన్‌ డ్రోన్లు, వందేభారత్‌ రైళ్లు, డిజిటల్‌ కరెన్సీకి ఈ బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యం కల్పించామని, బ్యాంకింగ్‌ రంగంలోకి కొత్తగా డిజిటల్‌ యూనిట్లు వచ్చాయని, జాతీయ ఆరోగ్య పథకం కింద డిజిటల్‌ ఎకో సిస్టమ్‌ తీసుకొస్తున్నామని స్పష్టం చేశారు. అంతేకాకుండా వ్యవసాయ అంకురాల ప్రోత్సాహానికి ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తామని, కొండ ప్రాంత ప్రలజ జీవన విధానం సులభతరానికి కృషి చేస్తామని, కేంద్ర బడ్జెట్‌ ద్వారా అనేక రంగాలకు లబ్ధి చేకూరింది ప్రధాని మోడీ అన్నారు. ఈ బ‌డ్జెట్ ఆర్థిక వ్య‌వ‌స్థ ప‌టిష్టంగా ఉండ‌డానికి త‌క్షణ అవ‌స‌రాల‌ను ప్ర‌స్తావిస్తుంది. ఇది మ‌రింత పెట్టుబ‌డులు, మ‌రిన్ని మౌలిక స‌దుపాయాలు, మ‌రింత వృద్ధిని నిర్ధారిస్తుంది” అని ప్ర‌ధాన మంత్రి అన్నారు. రోడ్లు, హైవేలు, రైల్వేలు – ఈ బ‌డ్జెట్ మౌలిక స‌దుపాయాల‌కు పెద్ద ఊపునిస్తుందని మోడీ అన్నారు.

 

ఇది ‘జీరో’ సమ్ బడ్జెట్

బీజేపీ ప్రభుత్వం ‘జీరో’ సమ్ బడ్జెట్ ప్రకటించిందని అంటూ విమర్శించారు. వేతన జీవులకు శూన్యహస్తాలు చూపించారని వ్యాఖ్యానించారు. మధ్యతరగతి ప్రజలకు, బడుగు, బలహీన, పేదలకు, యువతకు, రైతులకు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు కూడా మొండిచేయి చూపారని రాహుల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.