Fact check: కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవారికి రూ.5 వేలు ఇస్తున్నారంటూ మెసేజ్.. నిజమేంతంటే?

కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా

  • Written By:
  • Publish Date - October 3, 2022 / 07:01 PM IST

కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలను పొట్టను పెట్టుకుంది. దాదాపు రెండేళ్ల పాటు ప్రపంచం మొత్తాన్ని కుదిపేసింది ఈ మహమ్మారి. అయితే కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత దాని ప్రభావం పూర్తిగా తగ్గిపోయింది. ఇది ఇలా ఉంటే తాజాగా కరోనా మహమ్మారికి సంబంధించిన ఒక వార్త తెగ చెక్కర్లు కొడుతోంది. అదేమిటంటే కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి కేంద్ర ప్రభుత్వం 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తుంది అన్న మెసేజ్ సారాంశం.

సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన మెసేజ్ వైరల్ అవుతుండడం చూసి చాలామంది ఇది నిజం అని నమ్మడంతో పాటు ఇతరులకు కూడా షేర్ చేస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి ప్రభుత్వం నిజంగానే ఆర్థిక సహాయం అందిస్తుందా అంతే ప్రస్తుతం సోషల్ మీడియా ప్రకారం అవుననే వార్తలు వినిపిస్తున్నాయి.. ఇది ఈ కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారు సీఎం జన్ కళ్యాణ్ పోర్టల్ ద్వారా ప్రభుత్వం 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించనుంది.

ఈ ఆర్థిక సహాయం పొందాలి అనుకున్న వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది అంటూ వార్తను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. కాగా ఈ విషయంపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో స్పందిస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వార్త పూర్తిగా అవాస్తవాన్ని కొట్టి పారేసింది. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఆర్థిక సహాయం చేసే విధంగా ప్రభుత్వం ఎటువంటి పథకాన్ని ప్రారంభించలేదు అని వెల్లడించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ మెసేజ్ ను నమ్మవద్దని మెసేజ్ లోని లింక్ ని క్లిక్ చేయడం ద్వారా భవిష్యత్తులో కూడా ఇబ్బందులు ఎదురవుతాయి అని తెలిపింది.