Site icon HashtagU Telugu

CM KCR: సీఎం కేసీఆర్‌కు.. ప్ర‌ధాని మోదీ బ‌ర్త్‌డే విషెస్

Kcr Modi

Kcr Modi

టీఆర్ఎస్ అధినేత‌,తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 68వ పుట్టినరోజు వేడుక‌లు, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. ఈ క్ర‌మంలో సీఎం కేసీఆర్‌కు ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్ర‌మంలో సీఎం కేసీఆర్‌కు, ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ సంపూర్ణ ఆయురోరాగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు న‌రేంద్ర‌ మోదీ ట్వీట్ చేశారు. ఇక‌పోతే కొద్దిరోజులుగా మోదీ పై కేసీఆర్ తీవ్ర‌స్థాయిలో విమర్శలు చేస్తూ.. బీజేపీపైనా, కేంద్ర ప్రభుత్వం పై వార్ ప్ర‌క‌టించిన సంగ‌తితెలిసిందే. ఈ క్ర‌మంలో జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా కూటమిని ఏర్పాటు చేసే పనిలో కేసీఆర్ ఉన్నారు. ఈ సమయంలో కేసీఆర్‌కు ప్ర‌ధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలపడం రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

Exit mobile version