Site icon HashtagU Telugu

Modi-Sharad Pawar : ఒకే వేదికపై మోడీ, శరద్ పవార్ చెట్టపట్టాల్

Modi Sharad Pawar

Modi Sharad Pawar

Modi-Sharad Pawar : రాజకీయాల్లో ఎప్పుడైనా,  ఏదైనా జరగొచ్చని అంటారు.. దానికి నిదర్శనం ఇదే!! తన మేనల్లుడితో తిరుగుబాటు చేయించిన బీజేపీతోనూ  ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సఖ్యంగా మసులుకుంటున్నారు. ఇవాళ మహారాష్ట్రలోని పూణేలో తిలక్ స్మారక్ మందిర్ ట్రస్ట్  ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి ప్రధాని మోడీకి  లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారాన్ని అందజేసింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన వారిలో శరద్ పవార్ కూడా ఉన్నారు. ఈ కార్యక్రమం వేళ శరద్ పవార్, మోడీ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు.  చిరునవ్వులు చిందిస్తూ యోగక్షేమాలను పరస్పరం అడిగి తెలుసుకున్నారు.

Also read : Who Is Monu Manesar : హర్యానాలోని నూహ్ లో అల్లర్లు.. మోనూ మానేసర్ పైనే చర్చ.. ఎవరతడు ?

అవార్డును అందుకున్న అనంతరం ప్రధాని మోడీ మాట్లాడుతూ.. “ఇవి నాకు య్  గుర్తుండిపోయే క్షణాలు” అని(Modi-Sharad Pawar) చెప్పారు. కాంగ్రెస్ నేతృత్వంలోని “ఇండియా” కూటమి మూడో సమావేశం త్వరలో జరగబోతున్న తరుణంలో ప్రధాని మోడీతో కలిసి శరద్ పవార్ మీటింగ్ లో పాల్గొనడం రాజకీయ వర్గాల్లో హాట్ డిబేట్ గా మారింది. దీనిపై  “ఇండియా” కూటమిలోని ఇతర పార్టీలు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. మణిపూర్ హింసాకాండపై ప్రధాని మోడీ మౌనాన్ని విపక్షాలన్నీ ప్రశ్నిస్తున్న తరుణంలో.. శరద్ పవార్ మాత్రం ప్రధాని మోడీకి సంబంధించిన ప్రోగ్రామ్స్ లో పాల్గొంటుండటం గమనార్హం.

Also read : National Girlfriend Day : జాతీయ స్నేహితురాలి దినోత్సవం..!