Site icon HashtagU Telugu

PM MODI : ఉత్తరాఖండ్ కు ప్రధాని మోదీ, కేదార్ నాథ్-బద్రీనాథ్ లో ప్రత్యేక పూజలు..!

modi

modi

ఇవాళ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉత్తరాఖండ్ లో పర్యటించనున్నారు. కేదార్ నాథ్, బద్రీనాథ్ లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరంలో మనాలో రూ. 3400కోట్లతో పలు అభివ్రుద్ధి పథకాలకు శంకుస్థాపన చేయనున్నారు. వీటిలో కేదార్ నాథ్, హేమ్ కుండ్ సాహిబ్ రోప్ వేలు, చైనా సరిహద్దులో ఉన్న మనా ప్రాంతంలో రెండు హైవేలకు సంబంధించినవి ప్రాజెక్టులు ఉన్నాయి. కేదార్ నాథ్ రోప్ వేను ప్రధాని ప్రారంభించనున్నారు. ఈ రోప్ వేతో కేదార్ నాథ్ కు దూరం తగ్గుతుంది. అనంతరం ఆదిగురు శంకరాచార్య సమాధిని సందర్శిస్తారు. ఉదయం 11.30గంటలకు బద్రీనాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.