Site icon HashtagU Telugu

Govt jobs: నిరుద్యోగులకు కేంద్ర సర్కార్ గుడ్ న్యూస్…త్వరలో 10లక్షల ఉద్యోగాలు..!!

Pm Modi

Pm Modi

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది కేంద్ర ప్రభుత్వం. దేశవ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని డిసైడ్ అయ్యింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఏడాదిన్నర కాలంలో మోదీ సర్కార్ పది లక్షల ఉద్యోగాలు ఇవ్వనుందని మంగళవారం ఉదయం ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. మోదీ అన్ని శాఖలు, మంత్రిత్వ శాఖను సమీక్షించినట్లగా తెలుస్తోంది.

వచ్చే ఏడాదికాలంలో మిషన్ మోడ్ లో 10లక్షల మందిని నియమించాలని ప్రధాని మోదీ ఆదేశించారని పీఎంవో ట్వీట్ చేసింది. నిరుద్యోగ సమస్యపై కేంద్రం తీసుకున్న పెద్ద నిర్ణయంగా ఇది చెప్పాల్సిన అవసరం ఉంది. కేంద్ర సమాచారా, ప్రసారశాఖ మంత్రి అనురాగ్ ఠాకూరు పీఎంతో తరఫున ఉద్యోగ ప్రకటనపై ట్వీట్ చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్యపై విపక్షాలు తరచుగా సర్కార్ పై విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ రంగంలో పలు భాగాల్లో ఉన్న ఖాళీల గురించి కేంద్రం దృష్టికి తీసుకువస్తున్నాయి. ఈ క్రమంలోనే అన్ని ప్రభుత్వ శాఖల్లో మానవ వనరుల స్థితిగతులను సమీక్షించిన తర్వాత మోదీ నుంచి ఈ కీలక ప్రకటన వెలువడింది.

Exit mobile version