Modi Visits Mosque : ఈజిప్టు పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం మధ్యాహ్నం కైరో సిటీలోని అల్-హకీమ్ మసీదును సందర్శించారు. ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్-సిసితో కలిసి ఆయన ఈ మసీదుకు వెళ్లారు. ఇమామ్ అల్-హకీమ్ బి అమ్ర్ అల్లా అనే పూర్తి పేరు కలిగిన ఈ మసీదు(Modi Visits Mosque) 11వ శతాబ్దం నాటిది. అంటే వెయ్యేళ్ళ క్రితం దీన్ని నిర్మించారు.ఈ మసీదుకు 16వ ఫాతిమిద్ ఖలీఫ్ అల్-హకీమ్ బి-అమ్ర్ అల్లాహ్ (985-1021) పేరు పెట్టారు. గుజరాత్, మహారాష్ట్రలలో పెద్ద సంఖ్యలో ఉండే దావూదీ బోహ్రా కమ్యూనిటీ సహకారంతో ఈ మసీదును పునరుద్ధరించారు. మసీదు వద్దకు ప్రధాని మోడీ చేరుకోగానే .. దావూదీ బోహ్రా కమ్యూనిటీకి చెందిన ప్రముఖుడు షుజావుద్దీన్ షబ్బీర్ తంబావాలా స్వాగతం పలికారు.
Also read : Order Of The Nile : ప్రధాని మోడీకి ‘ఆర్డర్ ఆఫ్ ది నైల్’ .. ఈజిప్టు అత్యున్నత పురస్కారం ప్రదానం
ఈజిప్టు గ్రాండ్ ముఫ్తీ షాకీ ఇబ్రహెం అబ్దేల్ కరీం అల్లామా, దేశంలోని భారతీయ ప్రవాసులను కూడా మోడీ కలిశారు. ఈజిప్ట్, పాలస్తీనా తరఫున మొదటి ప్రపంచ యుద్ధంలో పోరాడిన సుమారు 4,000 మంది భారతీయ సైనికుల స్మారకార్థం ఉండే హెలియోపోలిస్ వార్ శ్మశానవాటికను కూడా ప్రధాని మోడీ సందర్శించారు. అంతకుముందు ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్-సిసితో ప్రధాని మోడీ ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. ఇరుదేశాల సంబంధాల బలోపేతానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.