Site icon HashtagU Telugu

PM Modi: కర్ణాటక బీజేపీ కార్యకర్తలతో ప్రధాని వీడియో కాన్ఫిరెన్స్

Pm Modi (1)

Pm Modi (1)

PM Modi: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. కాగా ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ పార్టీ కార్యకర్తలతో వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించారు. బీజేపీని గెలిపించడంలో కార్యకర్తలు మాత్రమే ముఖ్య పాత్ర పోషిస్తారని కొనియాడారు. బీజేపీ కార్యకర్తలు ప్రజల వద్దకు వెళ్లి ప్రభుత్వ పథకాల గురించి చెప్పాలని ప్రధాని మోదీ వీడియో ప్రసంగం ద్వారా బీజేపీ కార్యకర్తలకు సూచించారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి ఏ విధంగా వేగవంతం అయ్యిందో ప్రజలకు తెలియజేయాలని దిశానిర్దేశం చేశారు.

కర్నాటకలో ప్రచారానికి వెళ్తున్న బీజేపీ నేతలపై ప్రజలు అభిమానాన్ని కురిపిస్తున్నారని ప్రధాని అన్నారు. అలాగే రెండు రోజుల తర్వాత కర్ణాటకలో ప్రధాని ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నట్టు ప్రధాని తెలిపారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి గురించి కాకుండా అవినీతి ఏ రేంజ్ లో జరిగిందో అందరికి తెలియాలన్నారు. కాంగ్రెస్‌ 70 ఏళ్లలో నిర్మించిన ఎయిమ్స్‌ కంటే మా ప్రభుత్వం 10 ఏళ్లలో ఎక్కువ ఎయిమ్స్‌ను నిర్మించిందన్నారు. కాంగ్రెస్ అంటే అవినీతి, తప్పుడు వాగ్దానాలు అనే అర్థం వచ్చేలా ఉందని ప్రధాని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఈ కాన్ఫిరెన్స్ లో బీజేపీ కార్యకర్తల ప్రతి ప్రశ్నకు మోదీ సమాధానమిచ్చారు. 10 రోజుల్లోపు ఎలా గెలవాలని అలాగే కాంగ్రెస్‌తో సహా ఇతర పార్టీల కంచుకోటలను ఎలా గెలుచుకోవాలని ఒక కార్యకర్త ప్రధానిని అడిగినప్పుడు, ప్రధానమంత్రి తన గురుమంత్రాన్ని అందించారు. ముందుగా మీరు 20 మంది కష్టపడి పనిచేసే కార్మికులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసి ప్రజల్లోకి వెళ్లాలని ప్రధాని సూచించారు. కాంగ్రెస్‌తో సహా ఇతర పార్టీల హయాంలో కర్ణాటకకు ఎలాంటి అభివృద్ధి జరగలేదని, బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి పనులు చేశారో ప్రజలే చెప్పాలని ప్రధాని అన్నారు.

Read More: Minor Boys: బైక్ రైడింగ్ చేస్తున్న మైనర్లు.. 144 మందిపై కేసులు