PM Modi: జూలై 8న తెలంగాణాలో ప్రధాని మోడీ పర్యటన

ప్రధాని నరేంద్ర మోడీ జూలై 8న తెలంగాణాలో పర్యటించనున్నారు. వరంగల్ జిల్లా కాజీపేటలో రైల్వే వ్యాగన్ ఓవర్‌హాలింగ్ ఫ్యాక్టరీ శంకుస్థాపన చేసేందుకు

Published By: HashtagU Telugu Desk
Mann Ki Baat

Modi5

PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ జూలై 8న తెలంగాణాలో పర్యటించనున్నారు. వరంగల్ జిల్లా కాజీపేటలో రైల్వే వ్యాగన్ ఓవర్‌హాలింగ్ ఫ్యాక్టరీ శంకుస్థాపన చేసేందుకు ప్రధానిఈ పర్యటన చేపట్టనున్నారు. ఇదే సమయంలో రాష్ట్ర బీజేపీ ఏర్పాటు చేయబోయే భారీ బహిరంగ సభలో మోడీ ప్రసంగించనున్నారు. రాష్ట్ర భాజపా చీఫ్‌ బండి సంజయ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో పార్టీ నేతలు బహిరంగ సభను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాలలో భారీగా ఏర్పాట్లకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని పర్యటన పార్టీకి ఊపునిస్తుందని రాష్ట్ర బీజేపీ నేతలు భావిస్తున్నారు.

గత నెల ఏప్రిల్‌లో తెలంగాణలో పర్యటించిన ప్రధాని నరేంద్రమోదీ వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి జాతికి అంకితం చేశారు. సుమారు 11,300 కోట్లతో ప్రాజెక్టులకు మోడీ శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టులు రైల్వేలు, రోడ్డు కనెక్టివిటీ మరియు ఆరోగ్య మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించినవి.

Read More: Make In India: ‘మేక్ ఇన్ ఇండియా’పై రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రశంసలు

  Last Updated: 30 Jun 2023, 11:03 AM IST