Central Cabinet:కేంద్ర కేబినెట్ సమావేశం. చర్చించే అంశాలివే

ఓమిక్రాన్ నేపధ్యంలో బుధవారం ప్రధాని మోదీ కేంద్ర కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఓమిక్రాన్ కేసులను ఎలా కట్టడి చేయాలన్న విషయంతో పాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఎజెండా అంశాలుగా ఉండొచ్చని సమాచారం.

పెరుగుతున్న ఓమిక్రాన్ కేసుల నేపథ్యంలో గతవారం మోదీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజలు, అధికారులు, ప్రభుత్వాలు అలెర్ట్ గా ఉండాలని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధాని సూచించారు.

కోవిడ్ పై పోరాటం ముగియలేదని, కోవిడ్ ప్రోటోకాల్ పాటించాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్నా కోలుకుతున్నవారి శాతం ఎక్కువగానే ఉంది. స్వీయ జాగ్రత్తలు పాటిస్తే ఇబ్బంది ఉండదని వైద్యులు సూచిస్తున్నారు.

రాష్ట్రాల పరిస్థితి బట్టి రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయాలు, చర్యలు తీసుకోవాలని కేంద్రం సూచించగా కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే ఆంక్షలు, నైట్ కర్ఫ్యూలు విధిస్తున్నారు. ఇక కేబినెట్ భేటీ తర్వాత ఎలాంటి గైడ్ లైన్స్ ఇస్తారో చూడాలి.