Modi Respect:ఆమెకు మోడీ పాదాభివంద‌నం

మోదీ తన ప్రసంగం ముగిసిన తర్వాత ప్రముఖ స్వాతంత్ర్య సమరమోధులు పసల కృష్ణమూర్తి, అంజలక్ష్మి దంపతుల కుటుంబ సభ్యులను కలుసుకున్నారు.

Published By: HashtagU Telugu Desk
Modi Respect

Modi Respect

మోదీ తన ప్రసంగం ముగిసిన తర్వాత ప్రముఖ స్వాతంత్ర్య సమరమోధులు పసల కృష్ణమూర్తి, అంజలక్ష్మి దంపతుల కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. వారి కుమార్తె పసల కృష్ణభారతి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. 90 ఏళ్ల కృష్ణభారతి వీల్ చెయిర్ లో ఉండగా, మోదీ ఆమెకు పాదాభివందనం చేశారు. ఆమెకు శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన కృష్ణభారతి సోదరిని, మేనకోడలిని కూడా కలుసుకున్నారు.
నరేంద్ర మోదీ ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లా వచ్చిన సంగతి తెలిసిందే. భీమవరంలో మన్యం విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరుదైన ఘటన చోటుచేసుకుంది.

  Last Updated: 04 Jul 2022, 06:08 PM IST