Site icon HashtagU Telugu

PM Modi: సైరా భానుపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు

Pm Modi (1)

Pm Modi (1)

PM Modi: ప్రముఖ నటి సైరా భానుపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. సైరా భానుతో సమావేశమైన మోడీ సినీ ప్రపంచంలో ఆమె చేసిన కృషి తరతరాలుగా గుర్తు పెట్టుకుంటుందని కొనియాడారు. ఈ క్రమంలో సమావేశానికి సంబందించిన ఫోటోలను మోడీ ట్విట్టర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. మొదటి చిత్రంలో ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. రెండవ చిత్రంలో ప్రధాని మోడీతో సైరా భాను కెమెరాలకు ఫోజులిచ్చారు. సైరా బాను జీని కలవడం చాలా అద్భుతంగా ఉంది. సినిమా ప్రపంచంలో ఆమె మార్గదర్శకత్వం తరతరాలుగా గుర్తించబడుతుంది. సమావేశంలో మేము చాలా విషయాల గురించి చర్చినట్లు మోడీ తెలిపారు.

సైరా బాను దివంగత లెజెండరీ నటుడు దిలీప్ కుమార్ భార్య. 1961లో షమ్మీ కపూర్ నటించిన ‘జంగ్లీ’తో ఆమె తొలిసారిగా నటించింది. ఆమె ‘షాగిర్డ్’, ‘సగినా’, ‘బ్లఫ్ మాస్టర్’, ‘ఆయీ మిలన్ కి బేలా’, ‘పదోసన్’ మరియు బైరాగ్ వంటి ఎన్నో గొప్పగొప్ప చిత్రాల్లో నటించింది. ఆమె చివరిగా 1988లో ఫైస్లాలో నటించింది.

Also Read: TS Polls 2023 : రూ.1కే నాల్గు గ్యాస్ సిలిండర్లు..హైదరాబాద్ లో AIFB అభ్యర్థి హామీ

Exit mobile version