Himachal Pradesh: హిమాచల్ వరదలపై మోడీ ఉన్నత స్థాయి సమీక్ష

హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.వందలాది మంది ప్రజలు ఇళ్ళు కోల్పోయారు. దీంతో ప్రభుత్వంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి

Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వందలాది మంది ప్రజలు ఇళ్ళు కోల్పోయారు. దీంతో ప్రభుత్వంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు విపక్షాలు ప్రధాని నరేంద్ర మోడీని నిలదీస్తున్నాయి. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. హిమాచల్ ప్రదేశ్ లో వర్షాల పరిస్థితిని ప్రధాని సమీక్షించారు. సహాయక చర్యల కోసం చేపడుతున్న పనులని అడిగి తెలుసుకున్నారు. ప్రధాని మోదీ అధికారిక నివాసం 7 లోక్‌కల్యాణ్‌ మార్గ్‌లో గంటపాటు జరిగిన ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు పాల్గొన్నారు.

భారీ వర్షాల నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రేపు ఆదివారం హిమాచల్ ప్రదేశ్‌కు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో వర్షాలకు ప్రభావితమైన వారిని కలవనున్నారు. ప్రకృతి విపత్తులో మరణించిన వారి కుటుంబాలను కూడా నడ్డా కలుసుకోనున్నారు. సిమ్లాలోని సమ్మర్‌హిల్‌లో భారీ వర్షాల కారణంగా ధ్వంసమైన పురాతన శివాలయాన్ని ఆయన సందర్శించనున్నారు.

Also Read: Rahul Gandhi: కెటిఎమ్ 390 డ్యూక్ బైక్ పై రాహుల్