PM Modi – ISRO Team : చంద్రయాన్-3 దిగిన ప్రదేశానికి ‘శివశక్తి’గా నామకరణం : ప్రధాని మోడీ

PM Modi -ISRO Team : చంద్రయాన్ 3 విజయం సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తల టీమ్ ను అభినందించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం ఉదయం బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్​ అండ్​ కమాండ్​ నెట్​వర్క్​ ​ కాంప్లెక్స్​ కు వెళ్లారు.

  • Written By:
  • Updated On - August 26, 2023 / 10:10 AM IST

PM Modi -ISRO Team : చంద్రయాన్ 3 విజయం సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తల టీమ్ ను అభినందించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం ఉదయం బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్​ అండ్​ కమాండ్​ నెట్​వర్క్​ ​ కాంప్లెక్స్​ కు వెళ్లారు.  ఇస్రో ఛైర్మన్ ఎస్​.సోమనాథ్​​తో పాటు చంద్రయాన్​-3 మిషన్ లో కీలక పాత్ర పోషించిన శాస్త్రవేత్తలను ఆయన కలిశారు. వారిలో కలిసి గ్రూప్​ ఫొటో దిగారు.

ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ‘చంద్రయాన్​-3 ల్యాండింగ్​ సమయంలో నేను ఇండియాలో లేను. చంద్రుడిపై మన ల్యాండర్ దిగిందనే సంతోషంలో నన్ను నేను నియంత్రించుకోలేకపోయాను. అందుకే గ్రీస్ పర్యటన ముగించుకొని.. ఇస్రో శాస్త్రవేత్తలను కలిసేందుకు నేరుగా బెంగళూరుకు వచ్చాను. చంద్రయాన్-3 సక్సెస్ ను దేశానికి అందించిన సైంటిస్టులకు నా అభినందనలు’ అని  పేర్కొన్నారు. జై విజ్ఞాన్​, జై అనుసంధాన్ అనే నినాదాన్ని ఈసందర్భంగా ప్రధాని (PM Modi – ISRO Team) ఇచ్చారు.  చంద్రయాన్-3 దిగిన ప్రదేశానికి ‘శివశక్తి’గా నామకరణం చేద్దామని ఆయన ప్రతిపాదించారు. ఆగ‌స్టు 23వ తేదీని ఇక నుంచి జాతీయ అంత‌రిక్ష దినోత్స‌వంగా నిర్వ‌హించ‌నున్న‌ట్లు ప్రకటించారు. అంతకుముందు శనివారం ఉదయం బెంగళూరులోని హెచ్​ఏఎల్​ విమానాశ్రయంలో దిగగానే ప్రధాని మోడీకి బీజేపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. వారందరిని ఉద్దేశించి మోడీ మాట్లాడారు. ఇస్రోపై ప్రశంసల వర్షం కురిపించారు.