Modi in TS: ఈ నెల 26న హైదరాబాద్ లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన…

ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 26న తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ మేరకు పీఎంవో కార్యాలయం పర్యటన వివరాలకు వెల్లడించింది.

Published By: HashtagU Telugu Desk
Pm Modi Imresizer

Pm Modi

ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 26న తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ మేరకు పీఎంవో కార్యాలయం పర్యటన వివరాలకు వెల్లడించింది. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బి)లో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ మే 26న హైదరాబాద్‌కు వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర బీజేపీ శాఖ పేర్కొంది.

కాగా ప్రధాని మోదీ పర్యటన తెలంగాణ బీజేపీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని పెంచుతుందని ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. మోదీకి ఘనస్వాగతం పలికేందుకు పార్టీ నేతలతో సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. ఇదిలా ఉంటే ఎంపీ సంజయ్ ఇటీవల ముగిసిన రెండవ దశ ‘పాదయాత్ర’ సందర్బంగా బిజెపి అగ్రనేతలు – అమిత్ షా, జెపి నడ్డా తెలంగాణలో పర్యటించారు.

ఇదిలా ఉంటే ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ ముచ్చింతల్ సమీపంలో రామానుజ విగ్రహం ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. అనంతరం మరో సారి హైదరాబాద్ లో పర్యటించడం అటు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తోంది. మరోవైపు అధికార టీఆర్ఎస్ పార్టీ కేంద్రంలోని బీజేపీతో అమీ తుమీ తేల్చుకునే పనిలో పడింది. ఈ నేపథ్యంలో ఈ సారి కూడా ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక పర్యటనకు రాష్ట్ర ముఖ్యమం

  Last Updated: 19 May 2022, 01:33 AM IST