Narendra Modi: మోడీ తీవ్ర దిగ్బ్రాంతి.. కారకులను శిక్షించాల్సిందే

ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం రోజురోజుకి తీవ్రమవుతుంది. తాజాగా గాజాలోని ఓ ఆసుపత్రిపై జరిగిన బాంబ్ దాడిలో దాదాపు 500 మంది మరణించారు.

Narendra Modi: ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం రోజురోజుకి తీవ్రమవుతుంది. తాజాగా గాజాలోని ఓ ఆసుపత్రిపై జరిగిన బాంబ్ దాడిలో దాదాపు 500 మంది మరణించారు. అయితే దాడికి యత్నించింది ఎవరనేది ఇప్పటివరకు క్లారిటీ లేదు. ఇజ్రాయెల్ హమాస్ పై ఆరోపిస్తుంటే, హమాస్ ఇజ్రాయెల్ పై ఆరోపణలు చేస్తుంది. ఏదేమైనా ఈ దాడిలో బలి అయ్యింది మాత్రం ఆ ఆసుపత్రిలో ఉన్న సామాన్యులు మరియు సిబ్బంది. ఈ ఘటనపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

గాజాలోని అల్ అహ్లీ ఆస్పత్రిపై జరిగిన దాడి ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు . ఈ దాడిలో మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన ఆయన, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఈ దాడికి పాల్పడిన వారిని శిక్షించాలని ప్రధాని అన్నారు. ఆసుపత్రిలో జరిగిన ప్రాణనష్టం తీవ్ర దిగ్భ్రాంతికరం. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. అలాగే ఈ దాడిలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను అని ,హమాస్ మరియు ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఘర్షణలో పౌరుల ప్రాణాలు కోల్పోవడం అత్యంత ఆందోళనకరమైన అంశం. ఈ దాడికి బాధ్యులైన వారిని శిక్షించాలని మోడీ ట్వీట్ చేశారు.

Also Read: Bigg Boss 7 : ఆమె రీ ఎంట్రీ వల్ల లాభం ఎవరికి..? నష్టం ఎవరికి..?