Mann ki Baat : తెలంగాణ ప‌ర్వాతారోహ‌కురాలు మాలావ‌త్ పూర్ణ‌ని అభినందించిన ప్ర‌ధాని మోడీ

  • Written By:
  • Updated On - June 27, 2022 / 09:17 AM IST

న్యూఢిల్లీ: ‘సెవెన్ సమ్మిట్స్ ఛాలెంజ్’ను పూర్తి చేసినందుకు తెలంగాణకు చెందిన పర్వతారోహకురాలు పూర్ణ మాలావత్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రశంసలు కురిపించారు. పూర్ణ తన తాజా విజయంలో జూన్ 5న ఉత్తర అమెరికా ఖండంలోని ఎత్తైన పర్వతమైన దెనాలి (6,190 మీటర్లు) పర్వతాన్ని అధిరోహించింది. మ‌న్‌కిబాత్‌లో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ మాట్లాడుతూ సెవెన్‌ సమ్మిట్ ఛాలెంజ్‌ని పూర్తి చేయడం ద్వారా పూర్ణ తన విజయంలో మ‌రో ఎత్తుకు చేరింద‌ని తెలిపారు. ఆమె అలుపెరగని స్ఫూర్తితో, పూర్వా ఉత్తర అమెరికాలోని డెనాలి పర్వతంలోని ఎత్తైన శిఖరాన్ని అధిరోహించి దేశానికి గౌరవాన్ని తెచ్చిపెట్టిందని… కేవలం 13 ఏళ్ల వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన అద్భుతమైన ఘనతను సాధించిన ఘ‌న‌త పూర్థ‌ది అని మోడీ కొనియాడారు. ఉమ్మ‌డి నిజామాబాద్ జిల్లాకు చెందిన పూర్ణ, 13 సంవత్సరాల వయస్సులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి, శిఖరాన్ని చేరుకున్న అతి పిన్న వయస్కురాలు… ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలుగా నిలిచింది. పూర్ణ మౌంట్ ఎవరెస్ట్ (ఆసియా), మౌంట్ కిలిమంజారో (ఆఫ్రికా), మౌంట్ ఎల్బ్రస్ (యూరోప్), మౌంట్ అకాన్‌కాగువా (దక్షిణ అమెరికా), మరియు మౌంట్ కార్స్టెన్స్‌జ్ పిరమిడ్ (ఓషియానియా), మౌంట్ విన్సన్ (అంటార్కిటికా) మరియు మౌంట్ డెనాలి యాత్రలను పూర్తి చేసింది.